ఆ ఒక్కటి చేస్తే వదిలేస్తాం...! భారత్ కు ట్రంప్ సర్కార్ బిగ్ ఆఫర్..!

రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్తున్నామనే కారణంతో భారత్ పై సుంకాల మోత మోగించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు క్రమంగా కాళ్ల బేరానికి వస్తోంది. సుంకాల మోత తగ్గించే విషయంలో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పురోగతి లబించినట్లు కనిపిస్తున్నా ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో భారత్ కు అమెరికా ఇంధన శాఖ మంత్రి కీలక సూచన చేశారు.

భారత్ పై తొలుత 25 శాతం సుంకాల మోత మోగించిన ట్రంప్.. అనంతరం దాన్ని 50 శాతానికి పెంచారు. అయినా భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తమ ఇంధన భద్రత ముఖ్యమని భారత్ తేల్చిచెప్పేస్తోంది. దీంతో అమెరికాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ ను ఉద్దేశించి అమెరికా ఇంధన మంత్రి క్రిస్ వ్రైట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Trump Team Urges India to Cut Russian Oil Imports Softens Stand With No Punishment Remark

ప్రపంచంలో చాలా చమురు ఎగుమతిదారులు ఉన్నారని, భారతదేశం రష్యన్ చమురును కొనుగోలు చేయవలసిన అవసరం లేదని వ్రైట్ తెలిపారు. చౌకగా ఉందన్న కారణంతో భారత్ రష్యా చమురును చౌకగా కొనుగోలు చేస్తుందని, అయితే ఎవరూ రష్యా చమురును కొనాలని కోరుకోరని చెప్పుకొచ్చారు. వారు దానిని తగ్గింపు ధరకు అమ్మాలన్నారు. భారతదేశం చౌకైన చమురును కొనుగోలు చేసి, దీన్ని తమ ప్రయోజనాలకు వాడుకుంటోందని, కానీ ఇది ప్రతి వారం వేలాది మందిని హత్య చేస్తున్న వ్యక్తికి డబ్బును ఇస్తోందని రైట్ వ్యాఖ్యానించారు.

Trump Team Urges India to Cut Russian Oil Imports Softens Stand With No Punishment Remark

దీనికి బదులు భారత్ తమ వద్ద నుంచి చమురు కొనాలని సూచించారు. రష్యా తప్ప ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా చమురు కొనాలని కూడా సలహా ఇచ్చారు. తాము భారత్ ను ఈ విషయంలో శిక్షించాలనుకోవడం లేదని, కానీ ఉక్రెయిన్ యుద్ధానికి మాత్రం ముగింపు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు రైట్ తెలిపారు. అలాగే భారత్ తో సంబంధాలు అభివృద్ది చేసుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాను కూడా భారత్ ఫ్యాని అని, తాము ఆ దేశాన్ని ఎంతో ప్రేమిస్తామని తెలిపారు. తాము భారత్ తో చమురు వాణిజ్యం సహా అన్ని సంబంధాలను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+