హార్మూజ్ తెరవండ్రా : ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయిన ట్రంప్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి.. అదే సమయంలో ఇరాన్ ఆ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇక ఇరాన్ కు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని తెరవాలని.. సంధి చర్చలకు సహకరించాలని అల్టిమేటం ఇచ్చారు. అయినా ఇరాన్.. ట్రంప్ మాటలను పెడ చెవిన పెడుతోంది. యుద్ధాన్ని భీకరంగా కొనసాగిస్తోంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ మరోసారి ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలని ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే 48 గంటల్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయారు ట్రంప్. హార్మూజ్ జలసంధిని తెరవండి బా**ర్డ్స్ అంటూ ఫైర్ అయ్యారు. లేదంటే నరకానికి పంపిస్తా.. చూస్తూ ఉండండి.. అల్లాను ప్రార్థించండి అంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. ఇరాన్ మాత్రం ట్రంప్ మాటలను అస్సలు లెక్కచేయడం లేదు. దాడులను కొనసాగిస్తూనే ఉంది.
Donald Trump shares a strong message on Iran and the Strait of Hormuz, as tensions in the region continue to draw global attention#DonaldTrump #Iran #StraitOfHormuz pic.twitter.com/m7DHLVeaoL
— News18 (@CNNnews18) April 5, 2026
ఇదివరకే ట్రంప్ ఇరాన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం చేసుకునేందుకు లేదా హార్మూజ్ ను తెరిచేందుకు 10 రోజుల గడువు ఇచ్చాను.. సమయం మించిపోతుంది.. వారిపై ప్రళయం విరుచుకుపడేందుకు ఇక కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది.. అని ట్రూత్ సోషల్ ట్రంప్ పోస్టు చేశారు. ట్రంప్ మాటలను లెక్కచేయని ఇరాన్ అదే పనిగా సరిహద్దు అరబ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులపై దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఇవాళ మరోసారి ఇరాన్ పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు అమెరికాకు చెందిన ఎఫ్-15 ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో రెండో పైలట్ ను గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆ పైలట్ సురక్షితంగా ఉన్నాడని.. అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నెల 3న అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో ఒక పైలట్ ను కాపాడగా.. రెండో పైలట్ కనిపించకపోవడంతో అమెరికా, ఇరాన్ అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ప్రస్తుతం ఇద్దరు పైలట్లను ఇరాన్ భూభాగం నుంచి తీసుకొచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది.
-
అమెరికా 'యుద్ధ విమానాలు' కాదు అట్ట పెట్టెలు.. మా 'రఫేల్' నయం..! -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్ -
ఆ పైలట్ ట్రంప్ వద్ద కంటే ఇరాన్ లోనే సురక్షితం" -
ఇరాన్ అతిపెద్ద అణు కేంద్రం నుంచి భారీ లీక్- ఐరాసకు లేఖ -
పెట్రోల్ పై రూ. 80 తగ్గింపు: బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ‘బాబ్ అల్ మాండెబ్’..? -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు?











Click it and Unblock the Notifications