అయ్యో.. ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి.. మీరూ ఆ తప్పు చేస్తున్నారా..?

నిర్మల్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం జరిగింది. ఇంట్లోని ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన బంగల్ పేట్ వద్ద మహాలక్ష్మివాడలోని సి బ్లాక్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో జరిగింది. ఆ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఫ్రిడ్జ్ పేలింది దాంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చుట్టుపక్కల స్థానికులు క్షతగాత్రులను అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ, ఇంటి యజమాని మరణించారు.

ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వేసవిలో ఫ్రిడ్జ్, ఏసీల వాడకాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పలు సూచనలు చేశారు. అయితే ఫ్రిడ్జ్ పేలిన ఘటనతో పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ముఖ్యంగా వేసవిలో ఫ్రిడ్జ్‌ లు పేలిపోతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఫ్రిడ్జ్ పేలిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. వాటిలో ఎక్కువ శాతం మన నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. చిన్న తప్పుతో ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు.

ఫ్రిడ్జ్‌ ను ఉపయోగించడంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఫ్రిడ్జ్‌ లో అవసరానికి మించి పదార్థాలు నిల్వ చేయడం వల్ల గాలి సరిగా తిరగదు. ఇది కంప్రెసర్‌ పై అధిక ఒత్తిడిని పెంచుతుంది. దాంతో కంప్రెసర్ ఎక్కువ పని చేయడం వల్ల అది వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది. అలాగే.. ఫ్రిడ్జ్‌ ను ఓవర్ ‌లోడ్ చేయడం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఇది షార్ట్ సర్క్యూట్‌ కు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్మల్ లో జరిగింది ఇలాంటి ఘటనే..

Nirmal Horror Refrigerator Explosion Claims Two Lives in Mahalakshmiwada refrigerator explosion

అలాగే ఫ్రిడ్ ప్లగ్, సాకెట్‌ లలో ఏమైనా లోపాలు ఉండడం, తడిగా ఉండే ప్రదేశాల్లో ఫ్రిడ్జ్ పెట్టడం, నాణ్యతలేని వైర్లను వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఓల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా పరిస్ధితుల్లో స్టెబిలైజర్ ఉపయోగించకపోతే.. ఫ్రిడ్జ్‌ లోని కంప్రెసర్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఫ్రిడ్జ్‌ లో ఉపయోగించే కూలింగ్ గ్యాస్ (రిఫ్రిజరెంట్) లీక్ అయితే అది ఎక్కడైనా స్పార్క్ లేదా మంటను తాకి ఫ్రిడ్జ్ పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+