చైనా రేప్‌లు సాగనివ్వం: డొనాల్డ్ ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. చైనా వ్యాపారాన్ని గురించి మాట్లాడుతూ.. ఆ దేశం తమ దేశాన్ని రేప్ చేసిందని ఆరోపించారు.
దఫోర్డ్‌వేన్, ఇండియానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమెరికా వాణిజ్య లోటును గురించి చెబుతూ చైనాతో పోల్చి చైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మా దేశాన్ని చైనా రేప్ చేయడానికి ఇక ఏమాత్రం మేము అనుమతించం' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా ఎక్కువ ఉందని, చైనా తన కరెన్సీని అనుసంధానించడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో తన ఎగుమతులను పెంచుకోగలుగుతుందని ట్రంప్ ఆరోపించారు.

అమెరికా వాణిజ్యాన్ని చైనా చంపేస్తోందని అన్నారు. తమ దేశ వాణిజ్యంపై చైనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున 'రేప్' పదాన్ని ట్రంప్ ఉపయోగించినట్లు తెలిసింది.
చైనా కన్నా అమెరికా శక్తి వంతమైన దేశమని చెప్పారు. అయితే, చైనాపై తమకు ఎలాంటి కోపం లేదని తేల్చి తెలిపారు. ఇంతకుముందున్న నాయకుల అసమర్థత వల్లే అమెరికా వాణిజ్యం ఇలా తయారైందని ఆరోపించారు. మరోవైపు అధ్యక్ష పదవి రేసులో హిల్లరీ క్లింటన్ కూడా దూసుకుపోతున్నారు.












Click it and Unblock the Notifications