ట్విట్టర్ బ్లూ టిక్ కావాలా నాయనా..!!

వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఒక దాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో భారీగా కోత పెట్టారీ కొత్త బాస్. సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను సైతం తొలగించారు. లీగల్, పాలసీ చీఫ్ విజయ గద్దె సహా పలువురు టాప్ ఎగ్జిక్యూటివ్స్ తప్పుకొన్నారు.

ఎలాన్ మస్క్ వ్యవహార శైలి నచ్చకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటికొచ్చారు. అలాగే- పలువురు సెలెబ్రిటీస్ కూడా తమ ట్విట్టర్ అకౌంట్స్‌ను డిలెట్ చేసుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోన్నారు. అదే సమయంలో- అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ జనరల్ మోటార్స్.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ట్విట్టర్‌కు ఇచ్చే వాణిజ్య ప్రకటనలను బంద్ చేయనున్నట్లు తెలిపింది.

ఇదివరకే జనరల్ మోటార్స్ ట్విట్టర్‌కు యాడ్స్ ఇవ్వడాన్ని నిలిపివేసిన నేపథ్యంలో సంస్థ ఆదాయం తగ్గుముఖం పట్టొచ్చని యూఎస్ మీడియా అభిప్రాయపడుతోంది. జనరల్ మోటార్స్ తరహాలోనే ఫోర్డ్ మోటార్స్, స్టెల్లాంటిస్, వేమోకు చెందిన ఆల్ఫాబెట్ కూడా ట్విట్టర్‌కు ఇచ్చే తమ వాణిజ్య ప్రకటనలను నిలిపివేయొచ్చనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే- వాణిజ్య ప్రకటనల రూపంలో ట్విట్టర్‌కు అందే ఆదాయానికి భారీగా గండిపడినట్టే అవుతుంది.

 Twitter verification services roll out in India and it cost Rs 719 per month

ఈ పరిణామాల మధ్య సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎలాన్ మస్క్- కొత్త వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇకపై బ్లూ టిక్ వెరిఫికేషన్ ఉన్న ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్లను వసూలు చేయనున్నట్లు చెప్పారు. మొన్నటివరకు అమెరికా, బ్రిటన్‌లో ఈ పెయిడ్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అమలు చేశారాయన. తాజాగా భారత్‌లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఇప్పటివరకు పరిమితంగా ఉన్న బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అందరికీ వర్తింపజేసినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. ప్రతి నెలా 719 రూపాయలను చెల్లించి ఎవ్వరైనా సరే బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందవచ్చని స్పష్టం చేసింది. తొలుత- ఐఫోన్ వినియోగదారులకు ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. అనంతరం మిగిలిన వాటికి వర్తింపజేస్తామని పేర్కొంది. ఎవరైనా ట్విట్టర్ బ్లూను దుర్వినియోగం చేస్తే వారి డబ్బును జప్తు చేస్తామని కూడా హెచ్చరించింది. అలాంటి వారి ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని మస్క్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+