Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆఫ్ఘనిస్తాన్ లో రెండు భూకంపాలు

Afghanistan earthquake 2025: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస భూకంపాలు సంభవించాయి. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించాయి. తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజకిస్తాన్‌లోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. దీనివల్ల ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం లేదు.

కొన్ని చోట్ల ఆస్తినష్టం సంభవించింది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని పాక్షికంగా కూలిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ లో రెండు రోజుల్లో భూమి ప్రకంపించడం ఇది మూడోసారి. ఆ దేశ ఉత్తరప్రాంతంలోనే ఈ మూడు భూకంపాలు కూడా నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Two earthquakes rattled Afghanistan

తాజాగా తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 2:11 నిమిషాలకు 36.28 నార్త్ అక్షాంశం, 71.26 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బఘ్లాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 125 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.

అంతకు అరగంట ముందు 1:26 నిమిషాలకు అదే ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.2గా నమోదైంది. 36.48 నార్త్ అక్షాంశం, 70.85 తూర్పు రేఖాంశం వద్ద భూమి కంపించింది. ఉపరితలం నుంచి 125 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది.

భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలా సేపటి వరకు రోడ్ల మీదే గడిపారు.

ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల పలు నివాసాలు బీటలు వారినట్లు వార్తలొస్తోన్నాయి. భూకంప కేంద్రం పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటోన్నందున ఆ దేశంలోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి.

భారత్ చుట్టూ ఉన్న పాకిస్తాన్, చైనాతో ఆఫ్ఘనిస్తాన్ లో ఈ మధ్యకాలంలో తరచూ భూమి ప్రకోపిస్తోండటం చర్చనీయాంశమౌతోంది. నిజానికి- భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫైర్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు. అయినప్పటికీ- ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది ఆఫ్ఘన్. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.

2023 అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1,500 మంది వరకు మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టం అయ్యాయి అప్పట్లో.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+