ట్రంప్ తల తిక్క నిర్ణయం.. అమెరికాకు ఏకంగా 12.5 బిలియన్ డాలర్లు బొక్క..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలితో అటు ప్రపంచ దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా తలపట్టుకుంటోంది. ఆయన దుందుడుకు చర్యలకు అమెరికా టూరిజం భారీగా నష్టంపోయింది. ప్రపంచ దేశాలకు ట్రంప్ విధించిన ఆంక్షలు కారణంగా ఒక్క 2025లోనే అమెరికాకు ఏకంగా 12.5 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అక్కడి స్థానిక వార్తాకథనాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. ఎవరి మాట వినకుండా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాలు తాను చెప్పినట్లే నడచుకోవాలని ఉచిత సలహాలు ఇస్తూ ఆయా దేశాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్.. అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు అన్ని దేశాలపై టారిఫ్ ఆంక్షలు విధించారు. అమెరికాలోని యువతకే ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి దక్కాలని.. విదేశీ విద్యార్థులపై కఠినమైన రూల్స్ తీసుకొచ్చారు.

ఇలా అనేక నిర్ణయాల కారణంగా పర్యాటకంలో అమెరికాకు భారీ నష్టం ఏర్పడనుందని ది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్(WTTC) అంచనా వేసింది. 2024లో పర్యాటకం విభాగంలో అమెరికాకు 181 బిలియన్ డాలర్లు ఆదాయం రాగా.. ఈ ఏడాది కేవలం 169 బిలియన్ డాలర్లు మాత్రమే ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసదారులపై తీసుకున్న పలు కఠిన నిర్ణయాల కారణంగా ఇతర దేశాల ప్రజలు అమెరికా అంటేనే భయపడుతున్నారని డబ్ల్యూటీటీసీ తెలిపింది.

డబ్ల్యూటీటీసీ మొత్తం 184 దేశాలపై సర్వే నిర్వహించగా అమెరికాలో మాత్రమే టూరిజం తగ్గినట్లు తేలిందని పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది పర్యాటకం నుంచి వచ్చిన ఆదాయంలో 90 శాతం స్వదేశీ పర్యాటకుల ద్వారానే వచ్చిందని తెలిపింది. ఇతర దేశాల పర్యాటకులకు వెల్ కమ్ చెబుతుంటే అమెరికా మాత్రం కఠిన ఆంక్షలు విధిస్తోందని డబ్ల్యూటీటీసీ ప్రెసిడెంట్ జూలియా సింప్స్ సన్ తెలిపారు. పలు దేశాలపై విధించిన ఆంక్షలపై ట్రంప్ సర్కార్ సమీక్ష జరపాలని సూచనలు చేశారు.

U S Tourism Takes 12 5 Billion Hit Amid Trump-Era Policies

పర్యాటకరంగం సంక్షోభం కారణంగా అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది 60 నుంచి 120 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడనుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జుక్కా లైటమాకీ తెలిపారు. ట్రంప్ ఆంక్షల కారణంగా అమెరికా, కెనడాల మధ్య కూడా సంబంధాలు దెబ్బతిన్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+