పెంపుడు శునకరాజాన్ని పెళ్లాడిన మహిళ

UK woman 'marries' pet dog, gives a kiss to seal wedding
లండన్: ఇంగ్లాండుకు చెందిన ఓ మహిళ తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది. మనుషులు నచ్చకపోవడంతో ఆమె కుక్కను వివాహం చేసుకుంది. దానికి గుర్తుగా పెంపుడు కుక్కకు ముద్దులు కురిపించింది. లండన్‌కు చెందిన 47 ఏళ్ల అమండా రోడ్జర్స్ ఈ పని చేసింది.

భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆ మహిళ ఓ కుక్కను పెంచుకుంటోంది. ముద్దుగా దానికి షెబా అనే పేరు పెట్టింది. జీవిత భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఆ శునక రాజానికి ఉన్నాయని ఆమె అంటోంది. తన వివాహ వేడుకకు 200 మందిని ఆహ్వానించింది.

2012 ఆగస్టులో ఆ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా షెబా తన జీవితంలో భాగమైపోయిందని, తనను ఎప్పుడూ సంతోషంగా, సౌకర్యంగా ఉంచుతోందని, జీవిత భాగస్వామి నుంచి తనకు కావాల్సింది అంతకు మించి ఏమీ లేవని ఆమె అంటోంది.

అమండా 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కొన్ని నెలల్లోనే అతనితో ఆమె తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్తతో పోలిస్తే కుక్కతోనే ఆమె ఎక్కువ రోజులు సంసారం చేసింది. న్యాయపరంగా షెబా అది వివాహం కాకపోవచ్చు గానీ షెబా తనకు ఏమిటో చెప్పడం తనకు చాలా ఆందంగా ఉందని రోడ్జర్ అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+