Russia Verus Ukraine War: చెర్నోబిలా మజాకా ? రేడియేషన్ దెబ్బకు రష్యా సేనల జంప్
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని పలు పట్టణాలు, నగరాల్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్లకటనలు చేస్తూనే ఉంది. అయితే రష్యా ఆధీనంలోకి తీసుకున్న పలు ప్రాంతాలు తిరిగి ఉక్రెయిన్ ఆధీనంలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు స్ధానికంగా ఉన్న పరిస్ధితులు దోహదం చేస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా రష్యా సేనలు స్వాధీనం చేసుకున్న చెర్నోబిల్ తిరిగి ఉక్రెయిన్ చేతుల్లోకి వస్తోంది.
అత్యంత కలుషితమైన ప్రదేశంలో కందకాలు త్రవ్వడం ద్వారా సైనికులకు గణనీయంగా రేడియేషన్ రావడంతో రష్యన్ దళాలు చెర్నోబిల్ అణు కర్మాగారాన్ని విడిచిపెట్టడం ప్రారంభించాయని ఉక్రెయిన్ రాష్ట్ర విద్యుత్ సంస్థ తెలిపింది. అక్కడికి వెళ్లిన రష్యా దళాల తాజా పరిస్థితిపై లేదా ఎంతమంది ప్రభావితమయ్యారనే దానిపై వివరాలు మాత్రం ఇవ్వలేదు. అయితే, 1986లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు విపత్తు జరిగిన ప్రదేశంలో, ఇప్పుడు మూసేసిన ప్లాంట్ చుట్టూ ఉన్న రక్షిత జోన్‌లోని అడవిలో రష్యన్లు ఈ బంకర్లు తవ్వారని పేర్కొంది.

దీనిపై రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు. రష్యా దళాలు అధిక మోతాదులో రేడియేషన్ కు గురైనట్లు ఆధారాలు లేవని అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ కూడా ప్రకటించింది. అయితే వివరాలు తెప్పించుకుంటున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 24న దండయాత్ర ప్రారంభ దశలో రష్యన్ దళాలు చెర్నోబిల్ సైట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఇది రేడియేషన్‌ను వ్యాప్తికి దారి తీస్తుందనే భయాలను పెంచింది. చెర్నోబిల్ లో ఇంధన కడ్డీల సురక్షిత నిల్వను, పేలిన రియాక్టర్ కాంక్రీట్-సమాధి శిధిలాలు కూడా అక్కడ భయాల్ని పెంచాయి.
చెర్నోబిల్‌ను శుభ్రపరిచే సమయంలో కలుషితమైన పదార్థం బహుశా పూడ్చివేసి ఉండొచ్చని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది. లేదా కొత్త మట్టితో కప్పి ఉండొచ్చని వెల్లడించింది. కొంతమంది సైనికులు బంకర్లు తవ్వినప్పుడు ఈ రేడియేషన్ యొక్క హాట్ స్పాట్ కి గురై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా మాట్లాడుతూ, ఉక్రెయిన్ డాన్‌బాస్‌పై కొత్త దాడుల కోసం రష్యా బలగాలను మోహరిస్తోందని, ప్రతిఘటనకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంతలో, ఆ ప్రాంతంలో పరిమిత కాల్పుల విరమణకు రష్యన్ మిలిటరీ అంగీకరించిన తర్వాత, అప్పటికే చుట్టుముట్టిన ఓడరేవు నగరం మరియోపోల్ నుంచి ప్రజలను ఖాళీ చేయడానికి మరొక ప్రయత్నంలో బస్సుల కాన్వాయ్ మారియుపోల్‌కు వెళ్లింది. యుద్ధాన్ని ఆపేందుకు ఉద్దేశించిన కొత్త రౌండ్ చర్చలు కూడా ఇవాళ జరగబోతున్నాయి.












Click it and Unblock the Notifications