వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుతిన్ అణుదాడి హెచ్చరికలు-అమెరికా సాయం కోరబోతున్న జెలెన్ స్కీ-బైడెన్ తో భేటీ

|
Google Oneindia TeluguNews

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఎనిమిది నెలలుగా సాగుతున్న యుద్ధం ముగియకపోగా.. అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో చాలా ప్రాంతాల్ని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి వేల మందిని పొట్టనబెట్టుకున్న రష్యా.. ఇప్పుడు అణుదాడి హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్దితిని చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అవుతున్నారు.

యూఎస్ కాంగ్రెస్ లో ప్రసంగించేందుకు అమెరికా వెళ్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. అక్కడ అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కాబోతున్నారు. ఉక్రెయిన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఆయన బైడెన్ కు వివరించబోతున్నారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాలు చేస్తున్న సాయంతో రష్యాను ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న జెలెన్ స్కీ.. ఇప్పుడు రష్యా చేస్తున్న అణుదాడి హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. నిజంగా అణుదాడి జరిగితే ఎలా తిప్పికొట్టాలన్న దానిపై ఆయన యూఎస్ తో చర్చలు జరిపే అవకాశాలున్నాయి.

ukraine president zelensky to meet us counterpart joe biden amid russian nuke warnings

అమెరికాలోని వాషింగ్టన్ కు బయలుదేరిన జెలెన్ స్కీ.. కాంగ్రెస్ లో బైడన్ తో కలిసి ఉమ్మడిగా ప్రసంగించబోతున్నారు. రష్యా యుద్ధం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని కాంగ్రెస్ సభ్యులకు ఆయన వివరించే అవకాశముంది. అలాగే అమెరికా సాయం కోరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాల మద్దతుపై గుర్రుగా ఉన్న రష్యా అధినేత పుతిన్.. ఈ పర్యటన తర్వాత ఉక్రెయిన్ పై ఎలా స్పందిస్తారన్నది కూడా కీలకంగా మారుతోంది.

English summary
ukraine president zelensky to meet us president joe biden today to discuss latest situation in war zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X