‘రాణి యోని’ శిల్పం: అనీష్ కపూర్‌పై విమర్శలు
ప్యారిస్: ఫ్రాన్స్ దేశంలోని వెర్సల్లైస్ ప్రాంతంలో ‘రాణి యోని' పేరుతో రూపొందించిన శిల్పం కారణంగా బ్రిటీష్ ఇండియన్ శిల్పి అనీష్ కపూర్(61) ఆ దేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 200 అడుగుల పొడువు, 10 మీటర్ల ఎత్తుతో స్టీల్, రాయితో ఈ నిర్మాణం చేపట్టారు.
రాయల్ చిటావులోని గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణం.. ఒక ఏడాదిలో ఐదు మిలియన్ల పర్యాటకులను ఆకర్షించింది. కాగా, ఆ నిర్మాణానికి ‘డర్టీ కార్నర్' అనే పేరును పెట్టారు కపూర్. గత మంగళవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన నవంబర్ వరకు కొనసాగుతుంది.

ఇది ఇలా ఉండగా, ఈ నిర్మాణంపై కొన్ని ఫ్రెంచ్ మీడియా సంస్థలు పలు విమర్శలు గుప్పించాయి. ఇది ఒక కళంకమని రేడియో స్టేషన్ యూరప్1 వెబ్‌సైట్ పేర్కొంది.
ఫ్రెంచ్ న్యాయవ్యవస్థకు ఇది విరుద్ధంగా ఉందని ది కన్జర్వేటివ్ డెయిలీ లీ ఫిగరో తెలిపింది. కాగా, మరికొన్ని మీడియా సంస్థలు కపూర్ కళాఖండం పట్ల సానుకూల వైఖరిని వ్యక్తం చేశాయి. ఆ శిల్పం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications