హైడ్రోజన్ బాంబు నిజమా?: నగరాల్నే ధ్వంసం చేయగలదు

సియోల్: శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు ఉత్తర కొరియా సంచలన ప్రకటన చేసింది. ఇది అంతర్జాతీయంగా కలకలం సృష్టించింది. ప్రపంచ దేశాలు హైడ్రోజన్ బాంబు ప్రయోగాన్ని ఖండించాయి. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

ఉత్తర కొరియా చేసిన హైడ్రోజన్ బాంబు ప్రయోకం పైన పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్షించింది నిజమేనా? అంత సత్తా ఉత్తర కొరియాకు ఉందా? ఒకవేళ పరీక్ష నిజమే అయితే.. అణ్వాయుధాల విషయంలో భారీ ముందడుగు వేసినట్లే... అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజమే అయితే, తద్వారా అమెరికా భూభాగాన్ని ఛేదించగలిగే క్షిపణిపై అమర్చే ఆయుధాన్ని రూపొందించాలనే చిరకాల లక్ష్యాన్ని సాధించినట్లేనని భావిస్తున్నారు. ఉత్తర కొరియా తొలి సూక్ష్మీకృత హైడ్రోజన్‌ బాంబును ఉదయం పది గంటలకు విజయవంతంగా పరీక్షించినట్లు బుధవారం ఆ దేశపు అధికార టీవీలో ప్రకటించారు.

US Analysis Indicates North Korea Test Wasn't Hydrogen Bomb

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్ ఉన్‌ డిసెంబరు 15న సంతకం చేసిన ఆదేశాల ప్రతినీ ప్రదర్శించారు. 2016 తమ తొలి హైడ్రోజన్‌ బాంబు పేలుడు శబ్దంతో ప్రారంభమవ్వాలని, ప్రపంచం మొత్తం సామ్యవాద, అణ్వాయుధ దేశం వైపు చూడాలని కిమ్‌ జోంగ్ ఉన్ అందులో సంతకం చేసి, రాశారు.

హైడ్రోజన్ బాంబును తయారు చేసినట్లు ఉత్తర కొరియా ప్రకటించినా మరికొందరు దానిని అతిశయోక్తిగా కొట్టి పారేస్తున్నారు. హైడ్రోజన్ బాంబు తయారీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్ష నేపథ్యంలో భూకంప తరంగాల ప్రభావం చాలా చిన్నగా ఉండటాన్ని చూస్తే అది హైడ్రోజన్ బాంబు కాకపోవచ్చంటున్నారు.

ఇదీ హైడ్రోజన్ బాంబు

అణుబాంబు కన్నా హైడ్రోజన్‌ బాంబు విడుదల చేసే శక్తి ఎంతో ఎక్కువ. ఒక హైడ్రోజన్‌ బాంబు ఒకే సమయంలో అనేక నగరాలను ధ్వంసం చేస్తుంది. ఇప్పటి వరకూ ఏ దేశమూ దీనిని ఉపయోగించలేదు. తొలిసారిగా హైడ్రోజన్‌ బాంబును అమెరికా 1952లో పరీక్షించింది. 1953లో సోవియట్‌ రష్యా ఈ బాంబును పరీక్షించింది.

హైడ్రోజన్‌ బాంబులో శక్తి కేంద్రక సంలీనం ద్వారా విడుదలౌతుంది. కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువులు కలిసి పెద్ద పరమాణువుగా రూపొందుతాయి. హైడ్రోజన్‌ పరమాణువుల సంలీనం ఆధారంగా తయారవుతుంది.

అందుకే దీనికి హైడ్రోజన్‌ బాంబు అంటారు. చిన్న సైజులో తయారు చేయొచ్చు. క్షిపణిల ద్వారా ప్రయోగించవచ్చు. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా చెప్పినట్లుగా.. అది హైడ్రోజన్ బాంబును పరీక్షించలేదని అమెరికా విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+