భారత్‌పై అమెరికా, ఆస్ట్రేలియా అసహనం.. రష్యాతో సంబంధాలపై నిప్పులు..
ఉక్రెయిన్‌పై దాడులకు దిగిన రష్యాను ఒంటిరిని చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆంక్షలతో అధ్యక్షుడు పుతిన్ ఆటలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి. అటు రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలపై అమెరికా, ఆస్ట్రేలియా అసంతృప్తి వ్యక్తం చేశాయి.. ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ... రష్యాతో భారత్ చర్చలు జరపడం అమెరికాకు అసహనం వ్యక్తం చేసింది. భారత్ పర్యటనకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ రావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి.

రష్యాతో భారత్ చర్చలపై అమెరికా అసంతృప్తి
భారత్ -రష్యా చర్చలపై అమెరికా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా , ఐరోపా దేశాలు ఆంక్షలను ఉన్నప్పటికి... రష్యా ప్రతిపాదనను భారత్ పరిగణలోకి తీసుకుందంటూ విమర్శలు గుప్పించాయి. భారత్ వైఖరి చాలా నిరాశాజనకంగా ఉందని అమెరికా, ఆస్ట్రేలియా అసహనం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌కు అమెరికా, దాని మిత్రదేశాలు మద్దతుగా నిలబడే సమయం అసన్నమైందని యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమండో తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణలకు ఎలాంటి సాయం చేయవద్దని పిలుపునిచ్చారు.

ఇండియాపై ఆస్ట్రేలియా విమర్శలు
అటు ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహన్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. రష్యాతో భారత్ సంబంధాలపై అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన తర్వాత అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయని గుర్తు చేశారు. కానీ భారత్ మాత్రం ఎవరి పక్షం వహించకుండా రష్యాతో మునుపటిలా సంబంధాలను కొనసాగిస్తోందని విమర్శించారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.
అంతర్జాతీయంగా రష్యాని ఆర్థికంగా దెబ్బతీసేందుకు స్విఫ్ట్ నుంచి రష్యా బాంకులను ప్రపంచ దేశాలు తొలగించేలా చేశాయి. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంఘీ కూడా భారత్ పర్యటనకు వచ్చి చర్చలు జరపడంపై కూడా అమెరికా, దాని మిత్రదేశాలు గుస్సా అవుతున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతల్లో చైనా ప్రభావాన్ని ఎదుర్కొవడానికి ప్రయత్నిస్తున్న క్యాడ్ లోని సభ్యదేశాలు యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ లు ఇండియా తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ప్రపంచదేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించిన వేళ.. భారత్ మాత్రం చవకగా కొనుగోలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. భారత్ పట్ల ఆగ్రహంతో ఊగిపోతున్నాయి.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications