లాడెన్ ఆచూకీని పాకిస్తాన్‌తో పంచుకోని అమెరికా- నమ్మకం లేకే అన్న మాజీ సీఏఏ బాస్
గతంలో పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబంచిన అమెరికా ఆ తర్వాత దాన్ని మార్చుకుంది. ముఖ్యంగా తీవ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తుందన్న భారత్ విమర్శలను గతంలో లైట్ తీసుకున్న అమెరికా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌ను అవసరాల మేరకు మాత్రమే వాడుకోవడం అలవాటు చేసుకుంది.
గతంలో పాకిస్తాన్ తీవ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్లామాబాద్‌తో పంచుకున్న అమెరికా ఆ సమాచారం కాస్తా తీవ్రవాదులకు లీక్ కావడంతో అప్రమత్తమైంది. అల్‌ఖైదా మాజీ బాస్ బిన్ లాడెన్ ను హతమార్చిన ఆపరేషన్ విషయంలో ఆ విషయం మరోసారి రుజువైంది. పాకిస్తాన్‌లో దాక్కున్న బిన్ లాడెన్‌ను గుట్టు చప్పుడు కాకుండా హతమార్చిన అమెరికా.. ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరించిందనే విషయాన్ని అమెరికా గూఢచార సంస్ధ సీఐఏ మాజీ బాస్ లియోన్ పనెట్టా తాజాగా వెల్లడించారు.

2011 మే నెలలో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లోని ఓ బంకర్‌లో దాక్కున్న బిన్ లాడెన్ ఆచూకీని కనిపెట్టిన అమెరికా నేవీ సీల్ టీమ్.. ఆ సమాచారాన్ని మాత్రం పాకిస్తాన్‌తో పంచుకోలేదని సీఐఏ మాజీ బాస్ పనెట్టా వెల్లడించారు. పాకిస్తాన్‌కు మాట మాత్రమైనా చెప్పకుండానే లాడెన్‌ను గుట్టుగా హతమార్చినట్లు ఆయన తెలిపారు. ఇందుకు గతంలో పాకిస్తాన్ వ్యవహారశైలే కారణమన్నారు. తీవ్రవాదులకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన ఆధారాలను తిరిగి వారికే పంపిన అనుభవం పాకిస్తాన్ నుంచి తమకు ఎదురైందన్నారు. అందుకే లాడెన్ విషయంలో తాము జాగ్రత్త పడ్డామన్నారు. అప్పుడు పాకిస్తాన్‌తో ఆ సమాచారం పంచుకుంటే లాడెన్ తమకు ఎప్పటికీ దొరికే వాడు కాదని పనెట్టా సంచలన విషయాలు బయటపెట్టారు.
Recommended Video
పాకిస్తాన్‌పై నమ్మకం లేకే అమెరికా ప్రభుత్వం లాడెన్ ఆచూకీని కానీ, ఆపరేషన్ గురించి కానీ ఎలాంటి వివరాలు ఆ దేశంతో పంచుకోలేదని పనెట్టా తెలిపారు. పాకిస్తాన్‌తో ఈ సమాచారం పంచుకుని ఉంటే లాడెన్ సులువుగా పారిపోయే వాడని ఆయన అన్నారు. పాకిస్తాన్ విషయంలో భారత్ ఎప్పటి నుంచో వాదిస్తున్న ఆరోపణలకు పనెట్టా వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతిస్తుందనే విషయంలో అమెరికాకు అప్పుడే ఓ క్లారిటీ ఉందనీ తెలుస్తోంది.
-
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications