Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికాను వణికించిన భారీ భూకంపం: టర్కీలో వేలమందిని పొట్టనబెట్టుకున్న వేళ..

టర్కీని వరుస భూకంపాలు వెంటాడుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి విరుచుకుపడుతున్నాయి. అదే సమయంలో అమెరికాలోనూ భూమి ప్రకంపించింది. న్యూయార్క్ బఫెలోలో భూప్రకంపనలు నమోదయ్యాయి.

ఇస్తాంబుల్: టర్కీ మరోసారి వణికింది. ఒకే రోజు మూడు పెను భూకంపాలు ఆ దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. పొరుగునే ఉన్న సిరియాలోనూ ఇదే పరిస్థితి నెలకింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు భూకంపాలు సంభవించినప్పటికీ- ఈ స్థాయిలో మరణాల సంఖ్య ఎప్పుడూ నమోదు కాలేదు.

ఈ తెల్లవారు జాము నుంచి వరుసగా చోటు చేసుకున్న రెండు భూకంపాల్లో ఇప్పటికే 2,300 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఈ రెండు భూకంపాల ధాటికి కుప్పకూలిన భవనాల శిథిలాల నుంచి ప్రజలకు వెలికి తీసే చర్యలు శరవేగంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ భూమి ప్రకోపించింది.

 US earthquake: A 3.8 magnitude earthquake rattled the New Yorks Buffalo, West Seneca

తాజాగా కహ్రమన్మరాస్ ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ ప్రాంతంలో ఉంటుందీ ప్రావిన్స్. ఇక్కడి ఎల్బిస్తాన్ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 1:24 నిమిషాలకు ఎల్బిస్తాన్ జిల్లాలో తాజా భూకంపం ఏర్పడింది.

ఎల్బిస్తాన్ కు పశ్చిమ దిక్కున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి ఏడు కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు వివరించింది. భూ ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానికులు రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు సంభవిస్తోండటంతో వారిని మరింత భయాందోళనలకు గురి చేసింది.

కొన్ని చోట్ల భవనాలు కూలిపోయిన నేపథ్యంలో వాటి కింద పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తోన్నారు. ఆ తరువాత సరిగ్గా మూడు గంటల వ్యవధిలో మళ్లీ భూకంపం సంభవించింది టర్కీలో. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. 24 గంటల వ్యవధిలో మొత్తంగా టర్కీలో మూడుసార్లు భూకంపం చోటు చేసుకున్నట్టయింది.

దీని తరువాత తాజాగా అమెరికాను కూడా భూకంపం వణికించింది. న్యూయార్క్ సమీపంలోని బఫ్పెల్లో, వెస్ట్ సెనెకాలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా రికార్డయింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున 6:15 నిమిషాలకు ఈ భూకంపం నమోదైంది. బఫ్పెలో శివార్లలోని వెస్ట్ సెనెకాను భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+