US Election: చేజారుతున్న పరిస్ధితులు ? ఆ సెంటిమెంట్ ప్రయోగిస్తున్న కమలా హ్యారిస్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం 24 గంటలే మిగిలి ఉంది. రేపు జరిగే ఓటింగ్ కోసం ఓటర్లు సిద్దమవుతుండగా.. చివరి నిమిషంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డెమోక్రాట్ల అభ్యర్ధి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎంచుకున్న ఓ వ్యూహం ప్రస్తుతం ఓటర్లలో చర్చనీయాంశమవుతోంది. హోరాహోరీ పోరులో బయటపడేందుకు కమల వ్యూహాలకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చే స్వింగ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రిపబ్లికన్ల అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. నిన్న మొన్నటివరకూ కమలా హ్యారిస్ ఆయనకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు భారీ ఎత్తున నిధుల్ని సైతం సేకరించారు. కానీ తాజాగా పరిస్ధితి పూర్తిగా మారిపోయినట్లు తాజా సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో కమలా హ్యారిస్ తుది వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు ఆమె మహిళా సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నారు.

US Election kamala harris depending on women voters this time here is illustration

తాజాగా కమలా హ్యారిస్ ఎన్నికల ప్రకటనలు చూస్తుంటే మహిళా సెంటిమెంట్ ను ఆమె బలంగా నమ్ముకున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రంప్ తో హోరాహోరీ పోరులో గట్టెక్కాలంటే ఆర్దిక విధానాలు, భద్రత, వలసల నియంత్రణ వంటి అంశాలతో పాటు మహిళా సెంటిమెంట్ ను కూడా ప్రయోగించక తప్పడం లేదని తెలుస్తోంది. దీంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన దంపతుల్లో భార్య మహిళా అభ్యర్ధిని ఎంచుకుంటున్నట్లుగా ఓ యాడ్ తయారు చేశారు. ఇలాంటి అర్ధం వచ్చేలా మరికొన్ని యాడ్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై ట్రంప్ మద్దతుదారులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+