US elections 2020: వక్రమార్గంలో అధ్యక్షుడిగా ప్రకటించుకుంటావా .. జో బైడెన్ పై ట్రంప్ ట్వీట్
ఓ వైపు చారిత్రాత్మక విజయానికి డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేరువవుతున్న సమయంలో ట్రంప్ విజయావకాశాలు అంతకంతకూ తగ్గుతున్నాయి . ఓట్ల లెక్కింపులో చాలా అవకతవకలు జరిగాయని , సమయం గడిచినా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను స్వీకరిస్తున్నారని ఆరోపిస్తూ తాజా ఫలితాలపై కోర్టుకు వెళ్తానని పదే పదే చెప్తున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రత్యర్ధి జో బైడెన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రజాస్వామ్య రాజ్యం లో వక్రమార్గంలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలనుకోవద్దు
ప్రజాస్వామ్య రాజ్యం లో వక్రమార్గంలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని అనుకోవద్దు అంటూ ఆరోపించారు. బైడెన్ తప్పుడు మార్గంలో అధ్యక్షుడిగా ప్రకటించు కోకూడదు . అలా నేను చేయగలను. ఇప్పుడే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైంది అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుఎస్ ఎన్నికలలో ఓటమికి చేరువవుతున్న నేపధ్యంలో జో బైడెన్ ను కించపరిచే తన తాజా ప్రయత్నంలో, అధ్యక్ష పదవిని "తప్పుగా" ప్రకటించటానికి ప్రయత్నం జరుగుతోంది అంటూ ఛాలెంజర్ జో బైడెన్‌ను హెచ్చరించారు.

కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్ ను వెనక్కు నెట్టిన జో బైడెన్
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది . ముందు నుంచి జార్జియా, పెన్సిల్వేనియాలోఆధిక్యంలో ఉన్న ట్రంప్ ఇప్పుడు జో బైడెన్ కంటే వెనక్కు వెళ్ళిపోయారు. బైడెన్ విజయానికి చేరువ అవుతుండగా, డోనాల్డ్ ట్రంప్ ఓటమి అంచులకు చేరుకుంటున్నారు. పెన్సిల్వేనియా జార్జియా , నెవడా లలో ఏ ఒక్క చోట విజయం సాధించిన జో బైడెన్ కు అధ్యక్ష పీఠం దక్కినట్టే. ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట గెలుపొందిన బైడెన్ అధ్యక్షుడిగా అధికారం దక్కించుకుంటారు .

విజయావకాశం లేక జో బైడెన్ పై విరుచుకుపడుతున్న ట్రంప్
ప్రస్తుతం జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకోగా, డోనాల్డ్ ట్రంప్ 214 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. విజయావకాశాలు ఏమాత్రం లేకపోవడంతో డోనాల్డ్ ట్రంప్ మాటల దాడికి దిగారు.
డెమొక్రాట్ జో బైడెన్ వైట్ హౌస్ పీఠం దక్కించుకోటానికి చేరువగా ఉన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల సమరంలో కీలక రాష్ట్రాలలోనూ తన ఆధిక్యాన్ని చూపిస్తున్నారు , కాని అధికారులు ఓట్లను లెక్కించడం ఇంకా కొనసాగించడంతో విజేతగా ప్రకటించకుండా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది .
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications