మదర్ సెంటిమెంట్ వర్కౌట్- అమెరికాను దడదడలాడిస్తోన్న ఈ చిన్నారి..!!
Donald Trump vs Kamala Harris: ఇంకో రెండు రోజులు. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దాదాపుగా 35 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో నాలుగు సంవత్సరాల పదవి కోసం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
పోలింగ్ గడువు సమీపించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచార వేడిగా పతాక స్థాయికి చేరింది. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, ఈ దఫా ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.

ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ట్రంప్ వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 నాటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో ఓడిపోయారు. మూడోసారి బరిలో నిలిచారు.
నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ వంటి రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముమ్మర ప్రచారాన్ని సాగిస్తోన్నారు. మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినాల్లో తాజాగా కమలా హ్యారిస్ ర్యాలీలను హోరెత్తించారు.

ఈ పరిణామాల మధ్య కమలా హ్యారిస్ తన చిన్నప్పటి ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. తన తల్లి డాక్టర్ శ్యామల గోపాలన్ హ్యారిస్‌తో ఆడుకుంటున్నప్పటి ఫొటో అది. తల్లి గొప్పదనాన్ని వివరిస్తూ ఈ ఫొటోకు తన కామెంట్స్‌ను యాడ్ చేశారు. 19 సంవత్సరాల వయస్సులో ఒంటరిగా అమెరికాకు వచ్చారని, ఆమె పోరాటమే తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తన తల్లి ఇచ్చిన ఈ పోరాట స్ఫూర్తితోనే తాను అగ్రరాజ్యం అమెరికాలో ఈ స్థాయికి చేరుకున్నానని కమలా హ్యారిస్ గుర్తు చేసుకున్నారు. పోలింగ్ గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టయింది. అమెరికాలో నివసించే భారతీయ ఓటర్లను ఆకట్టుకున్నట్టయింది.

శ్యామల గోపాలన్ స్వరాష్ట్రం తమిళనాడు. ఆమె కుటుంబం చెన్నైలో నివసించేది. 65 సంవత్సరాల కిందటే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒంటరిగా అమెరికాకు తరలి వెళ్లారు. ఓక్లాండోలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో చదువుకున్నారు. యూసీ బర్కెలిలో చదువుకున్నారు. అక్కడే డాక్టరేట్ పొందారు.
బ్రెస్ట్ కేన్సర్ స్పెషలిస్ట్‌గా, పరిశోధకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్‌ను ఆమె పెళ్లాడారు. డొనాల్డ్ హ్యారిస్.. జమైకాకు చెందిన ఎకనమిస్ట్. శ్యామలా హ్యారిస్ చెల్లెలు డాక్టర్ సరళా గోపాలన్ ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు.












Click it and Unblock the Notifications