యూఎస్ ఎన్నికల్లో హైఓల్టేజ్ ఫైట్: లేటెస్ట్ పోల్‌ సర్వేలో షాకింగ్ వివరాలు

Donald Trump vs Kamala Harris: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరింది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.

నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముమ్మర ప్రచారాన్ని సాగిస్తోన్నారు.

US elections survey 2024 Donald Trump and Kamala Harris are tied at 48 percent each

ఈ పరిస్థితుల మధ్య ప్రీ పోల్ సర్వే వివరాలు వెలుగులోకి వచ్చాయి. ది న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఇది. ఇందులో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌కు సమనంగా ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇద్దరికీ 48 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.

ఈ నెల 20 నుంచి 24 తేదీల్లో నిర్వహించిన సర్వే ఇది. దాదాపుగా అన్ని రాష్ట్రాలకు చెందిన 2,516 మంది రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి వారి అభిప్రాయాలను సేకరించారు. దీన్ని క్రోడీకరించిన అనంతరం ఫైనల్ పోల్ సర్వే రిపోర్ట్‌ను ప్రచురించింది న్యూయార్క్ టైమ్స్. ఇద్దరికీ 48 శాతం చొప్పున ఓట్లు పడినట్లు తెలిపింది. మార్జిన్ ఎర్రర్ 2.2 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది.

మరో మీడియా హౌస్ సీఎన్ఎన్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలోనూ ఇదే రకమైన రిజల్ట్ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌కు 47 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి. ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సీఎన్ఎన్ ఈ సర్వే చేపట్టింది. 1,704 మంది ఓటర్లతో ఫోన్‌లో మాట్లాడి అభిప్రాయాలను సేకరించింది.

US elections survey 2024 Donald Trump and Kamala Harris are tied at 48 percent each

న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ నిర్వహించిన సర్వేలో మహిళలు కమలా హ్యారిస్‌ వైపు మొగ్గు చూపారు. 54 శాతం మంది మహిళలు ఆమె వైపు మొగ్గు చూపారు. 42 శాతం మంది మహిళలు ట్రంప్‌కు జైకొట్టారు. పురుషుల ఓటర్లల్లో ట్రంప్ పైచేయి కనిపించింది. 55 శాతం మంది ట్రంప్‌కు, 41 శాతం మంది కమలా హ్యారిస్‌కు మద్దతు ఇచ్చారు.

నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ ఎంత హోరాహోరీగా ఉండబోతోందనేది ఈ ప్రీ పోల్ సర్వే స్పష్టం చేసింది. కీలకమైన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిజ్ రాష్ట్రాల్లో ఇద్దరికీ సమానంగా ఓట్లు పడటం చర్చనీయాంశమైంది. నెవడా, నార్త్ కరోలినా, అరిజోనా, జార్జియాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇద్దరికీ సమాన ఓట్లు పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+