Kuwait: అమెరికాకు మిత్రదేశం కువైట్ బిగ్ షాక్..! ఏమీ తెలియనట్లు..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) చేస్తున్న యుద్ధం, దానికి ప్రతిగా ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడుల్లో గల్ఫ్ దేశాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అమెరికా బేస్ లు ఏర్పాటు చేసుకునేందుకు తమ భూభాగాలు ఇచ్చిన ఆయా దేశాలపై ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాడులతో అవి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వీటిని తిప్పికొట్టే క్రమంలో ఇవాళ ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు మిత్రదేశమైన కువైట్ (Kuwait) ఇవాళ ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చింది.
ఇరాన్ పై దాడికి వెళ్తున్న మూడు అమెరికా ఎఫ్-15ఈ ఫైటర్ జెట్లను కువైట్ కూల్చేసింది. అయితే ఆయా విమానాల్లోని పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి వాటిలో నుంచి దూకేసి తప్పించుకున్నారు. గాయాలపాలైన ఆయా పైలట్లను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న కువైట్.. తొలుత తమ దేశంలో పలు అమెరికా యుద్ధ విమానాలు కూలినట్లు చేసిన ప్రకటన యుద్ధంలో భాగస్వాములుగా ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇరానే వీటిని కూల్చేసినట్లు అంతా భావించారు.

కానీ సాయంత్రానికి కువైట్ చావు కబురు చల్లగా చెప్పింది. అమెరికాకు చెందిన మూడు యుద్ద విమానాల్ని తామే పొరబాటున కూల్చేసినట్లు కువైట్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తమ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇరాన్ విమానాలుగా భావించి వాటిని కూల్చేసినట్లు కువైట్ చెప్పుకొచ్చింది. ఇది ఫ్రెండ్లీ ఫైర్ మాత్రమేనని వివరణ ఇచ్చింది. దీంతో అమెరికా కూడా ప్రస్తుతానికి ఈ ప్రకటనను అంగీకరించింది. ఇరాన్ తో యుద్దంలో కువైట్ అందిస్తున్న సహకారాన్ని ధన్యవాదాలు తెలిపింది. అయితే కువైట్ నిజంగానే పొరబాటున ఈ ఫైటర్ జెట్లను కూల్చేసిందా లేక కావాలనే అలా చేసిందా అన్నది తేలాల్సి ఉంది.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
అమెరికా సైన్యం షార్క్‌లకు ఆహారమే: ఇరాన్ భీకర హెచ్చరిక.. -
ఇజ్రాయెల్ కెమికల్ ఫ్యాక్టరీలపై ఇరాన్ క్షిపణుల వర్షం.. లీకైన విష వాయువు..!! -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!












Click it and Unblock the Notifications