గ్రీన్ కార్డు, హెచ్1బీ వీసా దారులకు మరో షాక్..! అమెరికా వీడారో..!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై మాత్రమే కొరడా ఝళిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్నీ సక్రమంగా ఉండి గ్రీన్ కార్డులు, హెచ్ 1 బీ వీసాలు పొందిన వారికీ ట్రంప్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పుడు ఏ కొత్త రూల్ తీసుకొస్తారో, దేన్ని అడ్డుపెట్టి తమను దేశ బహిష్కరణ చేస్తారో తెలియక వారంతా ఆందోళనలో గడుపుతున్నారు.
అమెరికాలో గ్రీన్ కార్డు దారులకూ, హెచ్ 1బీ వీసా దారులకూ ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తమ ప్రయాణాల్లో చేస్తున్న తనిఖీలు, విధిస్తున్న ఆంక్షలతోనే. వీటి కారణంగా తమ కార్డులు ఎక్కడ రద్దవుతాయో అన్న భయాలు వీరిని వెంటాడుతున్నాయి. దీంతో గ్రీన్ కార్డు దారులు, హెచ్ 1బీ వీసా కలిగిన వారు తమ ప్రయాణాలు మానుకోవాల్సిన పరిస్ధితిలు ఎదురవుతున్నాయి.

ప్రస్తుతం అమెరికాలోని అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ గ్రీన్ కార్డు దారులు, హెచ్1బీ వీసా దారులు, ముఖ్యంగా విదేశీయులపై తనిఖీలు పెరిగిపోతున్నాయి. అలాగే వీరు స్వదేశాలకు వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ కూడా లేకుండా పోతోందట. దీంతో స్వదేశాలకు వెళ్లాలనుకునే వారు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకోవడం చేస్తున్నారట.
ప్రస్తుతం అక్కడి చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని ప్రాసెస్ చేయడం, నిర్బంధించడం, అవసరాన్ని బట్టి వెనక్కి పంపేయడం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫాక్స్ న్యూస్ కు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రీన్ కార్డు హోల్డర్లకు కూడా అమెరికాలో శాశ్వత నివాసం గ్యారంటీ లేదన్న ప్రకటన తర్వాత ప్రభుత్వం ఎయిర్ పోర్టుల్లో, సరిహద్దు చెక్ పాయింట్లలో తనిఖీలు ముమ్మరం చేసింది.
ఇదే క్రమంలో కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు వారిని నిర్బంధించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో శాశ్వత నివాసం ఉండే వారు దేశానికి బయట 180 రోజుల కంటే ఎక్కువ సమయం ఉండకూడదని న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరోవైపు ట్రంప్ సర్కార్ అక్కడి న్యాయ వ్యవస్థను పట్టించుకోకుండా దూకుడుగా ముందుకెళ్తుండటం కూడా వీరికి ఇబ్బందికరంగా మారింది. తమ నిర్బంధాలు, తనిఖీలపై కోర్టుల్ని ఆశ్రయించినా ఫలితం ఉంటుందా లేదో తెలియని పరిస్ధితులు చాలా చోట ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ వంటి దేశాల నుంచి అమెరికా వెళ్లిన నిపుణులు, సీనియర్ సిటిజన్లకు కష్టకాలం ఎదురవుతోంది.
-
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications