అమెరికాలో కరోనా సునామీ: విరుచుకుపడుతున్న పాజిటివ్ కేసులు: ఒక్కరోజే 4.5 లక్షలు

వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్- ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. భారత్ సహా అనేక దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తోన్నాయి. నెదర్లాండ్స్ వంటి కొన్ని యూరప్ దేశాలు లాక్‌డౌన్‌లోకీ జారుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఒమిక్రాన్ మదర్ వైరస్ కరోనా విజృంభిస్తోంది. భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా విరుచుకుని పడుతోంది. థర్డ్ వేవ్‌కు సిద్ధం కావాలనే సందేశాన్ని పంపించింది.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త కేసులు సునామీని సృష్టిస్తున్నాయి. ఉప్పెనల ముంచెత్తుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా నాలుగున్నర లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో 4,41,278 లక్షల కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ఇన్‌ఫెక్షన్స్ వెల్లడించింది. తాజా డేటాను విడుదల చేసింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

US has set a single day record with 441278 of Covid19 cases

ఈ నెల 20వ తేదీన అత్యధికంగా 2,90,000 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఇదే సింగిల్ డే రికార్డ్. గత ఏడాది కరోనా వైరస్ వ్యాపించడం మొదలైన తొలి రోజుల్లో గరిష్ఠంగా 2,94,015 కేసులు రికార్డయ్యాయి. ఈ రెండింటినీ బద్దలు కొట్టాయి తాజా కేసులు. నాలుగున్నర లక్షల వరకు వెలుగు చూశాయి. రోజువారీ కరోనా వైరస్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ కారణమౌతోంది. 58.6 శాతం మేర ఒమిక్రాన్‌గా తేలుతోందని సీడీసీ వెల్లడించింది.

దీనితో ఇప్పటిదాకా అమెరికాలో నమోదైన మొత్తం కేసులు అయిదున్నర కోట్లకు చేరుకున్నాయి. మరణాలు ఎనిమిదిన్నర లక్షలకు చేరువ అయ్యాయి. కరోనా వల్ల అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు ఇక్కడే ఎక్కువగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి యూరప్‌లోనూ నెలకొంది. బ్రిటన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రియాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. బ్రిటన్‌లో కల్లోలాన్ని రేపిందీ వేరియంట్.

భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. దేశంలో కొత్తగా 781 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 238 కేసులు రికార్డయ్యాయి. ఢిల్లీలో 167 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. తెలంగాణ-62 గుజరాత్-73, కేరళ-65, రాజస్థాన్‌-46, తమిళనాడు-34, కర్ణాటక-34, మధ్యప్రదేశ్-9, ఆంధ్రప్రదేశ్-6, పశ్చిమ బెంగాల్-11, హర్యానా-12, ఒడిశా-8 కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+