ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ: ముస్లీంల రాకపై అమెరికా కోర్టు స్టే
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన జారీ చేసిన ఆదేశాలను బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి శనివారం రాత్రి నిలిపివేశారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన జారీ చేసిన ఆదేశాలను బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి శనివారం రాత్రి నిలిపివేశారు. ఈ మేరకు అత్యవసర ఆదేశాలను జారీ చేశారు.
ఏడు ముస్లిం ఆధిక్య దేశాల వారు అమెరికా రాకుండా ట్రంప్ విధించిన ఆంక్షలను ఆ దేశ న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేయడం గమనార్హం.
ట్రంప్ నిర్ణయంపై ది అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ శనివారం కోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి యాన్ డొనెల్లి విచారణ నిర్వహించి ఈ ఆదేశాలు జారీ చేశారు.

దీని ప్రకారం చట్టపరమైన దరఖాస్తు ఆమోదం, వీసాతో అమెరికాలో నివసించే శరణార్థులు, అమెరికాలో ప్రవేశించడానికి చట్టపరమైన అనుమతులు ఉన్న వ్యక్తులను పంపించి వేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతోపాటు ఇప్పటి వరకు ప్రభుత్వ కొత్త ఆదేశాల కారణంగా అరెస్టైన వారి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
శరణార్థుల హక్కుల ప్రాజెక్ట్ లీగల్ డైరెక్టర్ లీ గెలెర్ట్న్ ఈ కేసును వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ చట్టం కింద బాధితులైన వారితో మాట్లాడి అవగాహన కల్పిస్తామని, కనీసం వారు తిరిగి ఆ నరకంలోకి వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు.
జడ్జి ఆదేశాల నేపథ్యంలో ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే వాసీలతో అమెరికా వచ్చిన వారిని దేశం నుంచి పంపించడానికి అవకాశముండదు.
-
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications