US Midterm Elections 2026: 52 ఏళ్ల చరిత్ర పునరావృతం-1974లో వాటర్ గేట్ రిజల్ట్స్ రిపీట్..!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Elections 2026) డెమోక్రాట్ల ప్రభంజనం కొనసాగుతోంది. అది ఏ స్దాయిలో ఉందంటే 52 ఏళ్ల క్రితం 1974లో వాటర్ గేట్ కుంభకోణం బయటపడిన తర్వాత రిపబ్లికన్లను డెమోక్రాట్లు ఈ స్దాయిలో చిత్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అర్ధ శతాబ్దం తర్వాత ఆ ఫీట్ రిపీట్ అయింది. దీన్ని బట్టి చూస్తే రిపబ్లికన్ల మీద, ముఖ్యంగా ట్రంప్ మీద జనంలో ఏ స్ధాయిలో ఆగ్రహం వెల్లువెత్తుతుందో అర్దమవుతోంది. తాజా ఫలితాల నేపథ్యంలో అమెరికన్లు 1974 నాటి వాటర్ గేట్ ఎన్నికల్ని గుర్తుచేసుకుంటున్నారు.

అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికల్లో హౌస్, సెనేట్ రెండింటిలోనూ మెజార్టీ సాధించిన డెమోక్రాట్లు అంతటితో ఆగేలా కనిపించడం లేదు. భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇంకా పలు చోట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఈ ఎన్నికలకు ముందు వెలువడిన అనుకూల ప్రీపోల్ సర్వేలు సైతం తేలిపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ప్రతినిధుల సభ (హౌస్)లో 435 స్ధానాలకు గానూ 410 స్ధానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో డెమోక్రాట్లు 253 సీట్లను గెల్చుకోగా.. రిపబ్లికన్లు 157 సీట్లతో సరిపెట్టుకున్నారు.
ఇప్పటికే మెజార్టీకి కావాల్సిన 218 సీట్లను దాటేసిన డెమెక్రాట్లు మరిన్ని సీట్లను గెల్చుకునే అవకాశం ఉంది. దీంతో 1974లో వాటర్ గేట్ కుంభకోణం తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత రిపబ్లికన్లు ఆ స్ధాయి పరాజయం చవిచూస్తున్నట్లవుతోంది.

US Midterm Elections 2026 Democrats Close In on Biggest House Gains Since 1974 Watergate Elections

1972 జూన్ 17న అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని వాటర్ గేట్ కార్యాలయ సముదాయంలోని డెమోక్రటిక్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలోకి ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారు. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కోసం ఆ పార్టీ సంభాషణల్ని రహస్యంగా వినడం, కీలక సమాచారం సేకరించడం చేస్తూ అరెస్టయ్యారు. పోలీసు విచారణలో వారికి నిక్సన్ ప్రచార టీమ్ తో సంబంధాలున్నట్లు తేలింది. వాషింగ్టన్ పోస్ట్ తో వరుస కథనాలు రావడంతో సెనేట్ దీనిపై విచారణ ప్రారంభించింది. ఇందులో వైట్ హౌస్ లో సంభాషణలు సైతం నిక్సన్ రహస్యంగా రికార్డు చేయిస్తున్నట్లు ఇందులో తేలింది. అలాగే వీటిలో వాటర్ గేట్ ఘటనను కప్పిపుచ్చేందుకు నిక్సన్ చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. దీంతో సుప్రీంకోర్టు ఆ రికార్డుల్ని స్వాధీనం చేసుకుంది. దీంతో నిక్సన్ పై అభిశంసన ప్రక్రియ చేపట్టారు. చివరకు 1974 ఆగస్టు 9న నిక్సన్ రాజీనామా చేశారు. అలా అమెరికా చరిత్రలో రాజీనామా చేసిన తొలి అధ్యక్షుడిగా నిక్సన్ అపప్రద మూటగట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో హౌస్ లో రిపబ్లికన్లు తుడిచిపెట్టుకుపోగా.. డెమోక్రాట్లు 45 సీట్లు గెలిచారు. దీంతో హౌస్ లో డెమోక్రాట్లు 291 సీట్లకు చేరుకోగా.. రిపబ్లికన్లు 144 సీట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు ఆ పరిస్ధితి మళ్లీ ఇప్పుడు మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+