మళ్లీ గాజా ఆక్రమించొద్దు- ఇజ్రాయెల్ కు అమెరికా హెచ్చరికలు, మంచిది కాదన్న బైడెన్..
హమాస్ తమ దేశంపై దాడి చేసిందన్న కారణాన్ని చూపుతూ పాలస్తీనాలోని గాజా నగరాన్ని తిరిగి ఆక్రమించుకునేందుకు
ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాల్ని అమెరికా తప్పుబట్టింది. హమాస్ పై ప్రతిదాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కు ఇప్పటివరకూ మద్దతిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు.. తాజాగా గాజా ఆక్రమణ కోసం ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను మాత్రం తప్పుబట్టారు.
ఇది ఇజ్రాయెల్ కు మంచిది కాదని వైట్ హౌస్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇజ్రాయెల్ దళాలు గాజాను తిరిగి ఆక్రమించుకోవడం మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భావిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. హమాస్‌పై యుద్ధం ముగిసిన తర్వాత ఈ పాలస్తీనా నగరంలో తీవ్రవాదుల కోసం తమ దేశ ప్రజల భద్రతను పణంగా పెట్టలేమంటూ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రకటించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేయించారు.

"ఇజ్రాయెల్ దళాలు గాజాను తిరిగి ఆక్రమించడం మంచిది కాదని అధ్యక్షుడు ఇప్పటికీ విశ్వసిస్తున్నారని,. ఇది ఇజ్రాయెల్‌కు మంచిది కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు మంచిది కాదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ సీఎన్ఎన్ తో వ్యాఖ్యానించారు. గాజా విషయంలో ప్రస్తుతం అమెరికా హోంశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జరుపుతున్న చర్చల్లో హమాస్ తో పోరు ముగిశాక ఆ తర్వతా గాజా ఎలా ఉంటుంది? గాజాలో పాలన ఎలా ఉంటుంది? అనే అంశాలున్నట్లు తెలిపారు. ఎందుకంటే అది ఎలా ఉన్నా తాజాగా హమాస్ దాడుల సమయంలో ఉన్నట్లు మాత్రం ఉండబోదన్నారు.
గాజా నగరంపై ఇజ్రాయెల్ భూమార్గంలో దాడులు చేయడాన్ని కూడా అమెరికా గతంలో తప్పుబట్టింది. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు హమాస్ తో పోరు ముగిశాక దాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలను అరబ్, ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. అమెరికా కూడా ఇది ఇజ్రాయెల్ ప్రజలకు మంచిది కాదని చెబుతోంది. అయినా ఇజ్రాయెల్ వినిపించుకునే పరిస్ధితుల్లో లేదు.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications