భారతీయులకు ట్రంప్‌ మరో షాక్‌- ఇకపై హెచ్‌1బీ ఉద్యోగాలకు బిజినెస్‌ వీసాలు కట్‌...

అమెరికా ఎన్నికలకు మరో రెండు వారాలు కూడా సమయం లేదు. ఇలాంటి కీలక సమయంలోనూ వీసాలపై అమెరికాలోని ట్రంప్‌ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్ల కోసం నిన్న మొన్నటి వరకూ పాకులాడిన ట్రంప్‌.. అవి ఎలాగో తనకు రావని తేలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

    US Election 2020 : H1B ఉద్యోగాల బిజినెస్‌ వీసాల పై ట్రంప్ కీలక నిర్ణయం! || Oneindia Telugu

    అమెరికాలో వివిధ ఉద్యోగాల కోసం భారత్‌ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన బీ1 కేటగిరీలో ఉద్యోగులు ఆన్‌ సైట్ సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి వీరు హెచ్1బీ వీసాలు తీసుకుని అమెరికా రావాలి. కానీ ఇలా బీ1 కేటగిరీలో అమెరికా వచ్చి పనిచేయడం ద్వారా అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అక్కడి సర్కారు ఆరోపిసోతంది. దీంతో ఇకపై వీరికి బిజినెస్‌ కేటగిరిలో వీసాలు మంజూరు చేయకూడదని ట్రంప్‌ సర్కారు ప్రతిపాదిస్తోంది. దీని ప్రభావం భారత్‌ నుంచి తమ ఉద్యోగులను తాత్కాలికంగా అమెరికాకు పంపే ఐటీ సంస్ధలపై పడబోతోంది. అమెరికా సర్కారు ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇకపై వీరికి తాత్కాలిక బిజినెస్‌ వీసాలు ఇచ్చి పంపేందుకు భారతీయ సంస్ధలకు వీలుండదు.

    US proposes not to issue business visa for H-1B speciality occupations

    అమెరికా కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై హెచ్‌ పాలసీ అనుసరించి జారీ చేసే బీ1 వీసాలకు దరఖాస్తు చేయాలంటే నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందనని ప్రభుత్వం చెబుతోం. విదేశీ నిపుణులు తమ దేశంలో సేవలు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. గతేడాది నవంబర్‌లో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు అమెరికా అటార్నీ జనరల్‌ నిబంధనల ఉల్లంఘన కింద 8 లక్షల డాలర్ల జరిమానా విధించారు. ఇన్ఫోసిస్‌కు చెందిన 800 మంది ఉద్యోగులు హెచ్‌1బీ పీసాలకు బదులుగా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకునే బీ1 వీసాల ద్వారా అమెరికాకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+