H-1B, H-4 Visas: భారత హెచ్1బీ, హెచ్4 వీసాలపై మరో సంచలనం..!
భారత్ నుంచి అమెరికా వెళ్లే నిపుణులు జారీ చేస్తున్న హెచ్1బీ, హెచ్4 వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ రోజుకో నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే హెచ్1బీ వీసా ఫీజుల పెంపు, అమెరికాలో దీనిపై రాష్ట్రాల న్యాయపోరాటాలు, మరోవైపు వీసా దరఖాస్తులకు వెట్టింగ్ (సోషల్ మీడియా తనిఖీలు) కారణంగా ఇంటర్వ్యూలు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఆయా వీసాలపై మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని హెచ్1బీ వీసా హెచ్4 వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ పంపుతున్నారు. వారి తాత్కాలిక వర్కింగ్ వీసాల్ని రద్దు చేస్తున్నట్లు వీటి సారాంశం. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా తనిఖీలు పెంచాలని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వేలాది వీసాలు రద్దయ్యాయి.

అమెరికా ప్రభుత్వం ఆయా హెచ్1బీ, హెచ్4 వీసాల్ని తాత్కాలికంగా రద్దు (prudential revoke) చేస్తోంది. అంటే తాత్కాలికంగా, ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే. వీసా శాశ్వత తిరస్కరణ కాదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇలా వీసాల తాత్కాలిక రద్దు.. అమెరికాలో ఒక వ్యక్తి యొక్క చట్టబద్ధమైన స్థితిని ప్రభావితం చేయనప్పటికీ, దరఖాస్తుదారుడి తదుపరి వీసా అపాయింట్‌మెంట్‌లో ఈ విషయాన్ని తిరిగి పరిశీలిస్తామని దీని అర్థం. ఈ వీసాల తాత్కాలిక రద్దు కారణంగా అమెరికాలో నివసించే వారిపై ఎలాంటి ప్రభావం పడదని తెలుస్తోంది. వీసా గడువు ముగిసేవరకూ వారు అక్కడే ఉండొచ్చు.

హెచ్1బీ దరఖాస్తుదారులు మరియు డిపెండెంట్ వీసాలపై ఉన్న కుటుంబ సభ్యుల సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను ప్రారంభిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విద్యార్థి వీసా హోల్డర్లతో ప్రారంభమైన ఆన్‌లైన్ ప్రొఫైల్‌ల సమీక్షను విస్తరించింది. ప్రుడెన్షియల్ వీసా రద్దు అనేది స్టేట్ డిపార్ట్‌మెంట్ ద్వారా తాత్కాలికంగా, ముందుజాగ్రత్తగా వీసా రద్దు చేయడం. ముఖ్యంగా వీసా దారు అర్హతలో సమస్య ఉండవచ్చునని ప్రభుత్వం అనుమానించిన సందర్భాలలో కానీ ఆ సమస్య ఇంకా పూర్తిగా నిర్దారించలేదని భావించినప్పుడు ఇలా చేస్తారని నిపుణులు చెప్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications