AI వీడియో వైరల్ : వెనిజులా అధ్యక్షుడు మదురోను ఇలానే నిర్బంధించారా..?

అమెరికా-వెనిజులా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అరెస్టు చేయడం తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ క్రమంలోనే మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం ఒక రహస్య ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకున్నట్లు చూపించే ఏఐ (AI) జనరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు 1 నిమిషం 54 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో హాలీవుడ్ సినిమా స్థాయిలో సన్నివేశాలు రూపొందించబడటం గమనార్హం. అయితే ఇది నిజ సంఘటన కాదు, కేవలం ఏఐ సాంకేతికతతో తయారుచేసిన కల్పిత వీడియోగా తెలుస్తోంది.

వీడియోలో ఏం ఉందంటే..?

వైరల్ వీడియో ప్రారంభంలో మదురో తన నివాసంలోని టెర్రస్‌పై నిలబడి చేతిలో గ్లాస్ పట్టుకుని ఏదో తాగుతూ ఆలోచనలో మునిగినట్లు చూపిస్తారు. అదే సమయంలో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ అక్కడికి వచ్చి మాట్లాడుతున్నట్లు సన్నివేశం ఉంటుంది. ఆ వెంటనే అమెరికా సైన్యానికి చెందిన యుద్ధ విమానాలు ఆ ప్రాంతానికి చేరుకుని మదురో నివాసాన్ని చుట్టుముట్టినట్లు వీడియోలో చూపించారు. ఆ తర్వాత అమెరికా సైనిక విమానంలోని సిబ్బంది "లక్ష్యాన్ని చేరుకున్నాం" అంటూ అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమాచారం ఇస్తున్నట్లు సంభాషణలు ఉన్నాయి.

venezuelan-president-nicolas-maduro-and-his-wife-arrest-ai-video-goes-viral

అనంతరం మదురో నివాసం సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు, బాంబులు జారవిడిచినట్లు సన్నివేశాలు చూపిస్తారు. పేలుళ్లతో ప్రమాదాన్ని గ్రహించిన మదురో, తన భార్యతో కలిసి సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నించడం.. అయితే అప్పటికే నివాసంలోకి చొచ్చుకువచ్చిన అమెరికా ప్రత్యేక దళాలు, మదురో భద్రతా సిబ్బందిలో ఒకరిని కాల్చి చంపినట్లు వీడియోలో చూపించారు. అనంతరం మదురో, సిలియా ఫ్లోర్స్‌లను నేలకూల్చి, చేతులు కట్టేసి అదుపులోకి తీసుకున్నట్లు సన్నివేశాలు ఉంటాయి. ఈ విజువల్స్ అత్యంత వాస్తవికంగా ఉండటంతో చాలామంది నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో భారీ స్పందన..

ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, వేల సంఖ్యలో షేర్లు, కామెంట్లు రావడం విశేషం. ముఖ్యంగా అమెరికా-వెనిజువెలా మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది. ఈ వీడియో పూర్తిగా ఏఐ టెక్నాలజీ, డీప్‌ఫేక్ విజువల్స్‌తో రూపొందించిన కల్పిత కంటెంట్ అని మీడియా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+