ఎంహెచ్17: రెబల్స్ ఆధీనంలోకి ప్రమాద స్థలి?, ఆందోళన
తోరెజ్(ఉక్రెయిన్): మూడు రోజుల క్రితం క్షిపణి దాడికి గురై తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కుప్పకూలిన మలేషియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్-17 విమానంలోని పలువురి మృతదేహాలను రష్యన్ మద్దతుదారులు ఎవరికీ చిక్కకుండా తరలించినట్లు తెలిసింది. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతానికి ఎవరినీ రానీయకుండా అడ్డుకుంకున్నట్లు సమాచారం.
మృతదేహాలను వారి బంధువులు, కుటుంబాలకు అందించేందుకు తాము చేస్తున్న ఏర్పాట్లకు ఉక్రెయిన్ రెబల్స్, రష్యన్ మద్దతుదారులు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ఇప్పటి వరకు 247 మృతదేహాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.

అయితే అక్కడికి అంతర్జాతీయ ప్రతినిధులెవరూ హాజరుకాలేదని తమకు సమాచారం ఉందని పేర్కొంది. కాగా, ఉక్రెయిన్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రతినిధులను బెదిరింపులకు గురి చేస్తోందని రష్యన్ మద్దతుదారులు, ఉక్రెయిన్ రెబల్స్ ఆరోపిస్తున్నారు. కాగా, యూరోపియన్ అధికారులు ఈ వాదనను ఖండించారు.
ఉక్రెయిన్ రెబల్స్ ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను తరలించేందుకు సహకరించాలని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ కోరారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వ సహకారంతో కలిసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సోమవారం ప్రత్యేక బృందాలను ఘటనా స్థలానికి పంపించనున్నట్లు చెప్పారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications