వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మై గాడ్: జర్మన్ వింగ్స్ కూలడానికి ముందు 'బెదిరిపోయిన' వీడియో

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: కొద్ది రోజుల క్రితం ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిన జర్మన్ వింగ్స్ ఎయిర్ బస్ ఏ 320 విమానానికి సంబందించిన.. చివరి నిమిషం వీడియోలు క్యాబిన్లో ఆందోళనలు కనిపిస్తున్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

జర్మన్ వింగ్స్ కూలిపోయే ముందు కొన్ని నిమిషాల ముందు వీడియో ఒకటి విచారణాధికారులకు లభ్యమైంది. అందులో ప్రయాణీకుల ఆందోళన కనిపిస్తోందని తెలుస్తోంది.

యూరోపియన్‌కు చెందిన రెండు మీడియా సంస్థలు ఆ వీడియోలను చూసినట్లు చెబుతున్నాయి. ఫ్రెంచ్ మేగజైన్ ప్యారిస్ మాచ్, జర్నన్ డెయిలీ బిల్డ్ పత్రికలు ఈ వీడియోల గురించి పేర్కొన్నాయి.

జర్మన్ వింగ్స్

జర్మన్ వింగ్స్

విమానం కూలుతున్న సమయంలో ప్రయాణీకులు అస్తవ్యస్తమయ్యారని, బెదిరిపోయారని, 'మై గాడ్' అంటూ పలికారని వీడియోలో ఉన్నాయని తెలుస్తోంది.

 జర్మన్ వింగ్స్

జర్మన్ వింగ్స్

ఈ వీడియో విమానం శిథిలాల నుండి దొరికిన ఓ పోన్‌లో లభించిందని చెబుతున్నారు. ఈ వీడియో కొన్ని సెకండ్ల పాటు ఉంది. విమానం కూలిపోతున్న సమయంలో.. ఏం జరుగుతుందో ప్రయాణీకులకు తెలుసునని వీడియోను బట్టి అర్థమవుతోంది.

 జర్మన్ వింగ్స్

జర్మన్ వింగ్స్

వీడియోలోని దృశ్యం చాలా బాధాకరంగా ఉందని, ఎవరు ఎవరనే విషయం గుర్తించలేకుండా ఉందని, అయితే, వారు అదే పనిగా అరుస్తున్నారని వీడియోలో ఉంది. ఏం జరుగుతుందనే విషయం వారికి తెలుసు. ప్రయాణీకులు ఏడుస్తూ... వివిధ భాషల్లో 'ఓ దేవుడా' అని పలికారు.

 జర్మన్ వింగ్స్

జర్మన్ వింగ్స్

కో పైలట్ తలుపు మూసివేయడంతో.. దానిని పైలట్ గొడ్డలితో కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వీడియోలో మూడుసార్లు అందుకు సంబంధించిన శబ్దాలు వినిపించాయి. విచారణాధికారులు ఈ వీడియోను పరీక్షించారు. విచారణ జరుపుతున్నారు.

English summary
A video purportedly showing the final seconds inside the cabin of the ill-fated Germanwings airliner minutes before it crashed emerged Tuesday, with two European media claiming to have seen the footage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X