Viral Video: కారులో గేదె.. చీరలో మరో చీర.. వైరల్ అవుతోన్న వీడియో..
కొంత మంది సులువుగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారుల్లో వెళ్తుంటారు. అలాంటి అడ్డుదారుల్లో ఒకటి దొంగతనం. కొంత మంది దొంగతనమే వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ దొంగల్లో పురుషులు,మహిళలు ఉన్నారు. అయితే కొంత మంది చాలా చాకచక్యంగా చోరీకి పాల్పడుతుంటారు. మనం తెలియకుండానే పర్సు కొట్టేస్తుంటారు. మనంకు తెలియకుండానే హ్యాండ్ బ్యాంగ్ ఎత్తుకెళ్తుంటారు. ఒక్కోసారి దొంగల తెలిపి చూస్తుంటే వావ్ అని అనిపిస్తుంది.
OMG whoa !! 🤣pic.twitter.com/fvJgUSwSug
— Figen (@TheFigen_) August 22, 2023
ముఖ్యంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ల్లో కూడా దొంగతనాలకు పాల్పడుతుంటారు. చాలా ప్రణాళిక బద్ధంగా చోరీలు చేస్తుంటారు. కానీ వారు చేసే దొంగతనం కొన్ని సార్లు సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది. ప్రస్తుతం పలు చోరీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వివిధ ప్రాంతాల్లో దొంగలు చోరీలు చేస్తుండగా.. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఫిగెన్ అనే వ్యక్తి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. వీడియోతో పాటు ఓ మై గాడ్ అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియోకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 61 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 20 వేలకు పైగా మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారులో గేదెను ఎత్తుకెళ్లే దృశ్యాలు చాలా ఫన్నీగా అనిపిస్తోంది. అయితే చోరీలకు పాల్పడిన వారిలో చాలా మంది పోలీసులకు చిక్కారు. కానీ అయినా కూడా వారు దొంగతనలు ఆపడం లేదు.
ఈ వీడియో చూసిన వారు ఈ తెలివి ఏదో చదువులు చూపిస్తే మంచి ఉద్యోగం వచ్చేదని ఒకరు.. ఐడియా అదిరింది అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఏదీ ఏమైన చోరీలకు పాల్పడితే ఏదో ఒక రోజు పోలీసులకు చిక్కడం ఖాయమని మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications