బ్లాక్‌మెయిల్: నెట్‌లో ప్రియురాలి న్యూడ్ ఫొటోలు, అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని ఓ భారతీయ అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్‌కు తన కూతురు మాజీ ప్రియుడి నుంచి బెదిరింపులు వచ్చాయి. తను అడిగిన మొత్తం చెల్లించకుంటే అతని కూతురు న్యూడ్ ఫొటోలను బహిరంగ పరుస్తానని హెచ్చరించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎఫ్‌బిఐ అధికారులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేట్ చేస్తున్న డగ్లస్ టార్లో (27) అనే యువకుడు భారతీయ అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా కూతురు నైనా(26)కు వలవేశాడు. అనంతరం ఆమెతో ప్రేమాయణం కొనసాగించాడు. ఆమెతో రెండేళ్లపాటు డేటింగ్ చేశాడు. డేటింగ్ సమయంలో దొంగచాటుగా ఆమె న్యూడ్ ఫొటోలను, వీడియోలను చిత్రీకరించాడు.

అనంతరం తనకు 72వేల డాలర్లను ఇవ్వాలని లేదంటే.. డేటింగ్ సమయంలో తీసిన చిత్రాలను ఆన్‌లైన్ పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. డబ్బు ఇవ్వకపోతే అన్నంత పని చేస్తానని ఒక్కసారి నెట్‌లో అప్ లోడ్ అయిన తర్వాత ఇక ఎవరూ తొలగించలేరంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన నైనా తల్లిదండ్రులకు విషయం చెప్పింది.
వినోద్ ఖోస్లా నిందితుడిపై ఎఫ్‌బిఐకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఎఫ్‌బిఐ అధికారులు నిందితుడు డగ్లస్ టార్లోను అరెస్ట్ చేశారు. శుక్రవారం నిందితుడు టార్లోను కోర్టు ఎదుట హాజరుపర్చారు.












Click it and Unblock the Notifications