viral video: ఇజ్రాయెల్ ప్రధానికి ఐరాసలో తీవ్ర అవమానం.. ! అంతా జంప్..!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఐక్యరాజ్యసమితిలో తీవ్ర అవమానం ఎదురైంది. ఇస్లామిక్ దేశాల విషయంలో, ముఖ్యంగా పాలస్తీనాలోని గాజా విషయంలో అవమానవీయంగా ప్రవర్తిస్తున్న నెతన్యాహుకు వ్యతిరేకంగా మెజార్టీ దేశాలు ఒక్కటయ్యాయి. ఐరాస సాధారణ సభలో నెతన్యాహు ప్రసంగం ప్రారంభించేందుకు రాగానే ఒక్కసారిగా షాకిచ్చాయి. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పోడియం వద్దకు రాగానే పలు దేశాల ప్రతినిధులు ఒక్కసారిగా సీట్లలో నుంచి లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు. పదుల సంఖ్యలో దేశాల ప్రతినిధులు ఇలా తమ సీట్లను వదిలి వెళ్లిపోవడం మొదలైంది. దీంతో ఐరాస సాధారణ సభను నడుపుతున్న అధికారులు అందరూ తమ తమ సీట్లలో కూర్చోవాలని వారిని బతిమాలడం ప్రారంభించారు. అయినా వారు వినకుండా వెళ్లిపోయారు.

తాను ప్రసంగించేందుకు రాగానే ఇలా పలు దేశాల ప్రతినిధులు లేచి వెళ్లిపోవడం చూసి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు షాకయ్యారు. అయినా ఏమీ మాట్లాడే పరిస్ధితి లేదు. దీంతో వారంతా వెళ్లిపోవడం పూర్తయ్యాక ఆయన ప్రసంగం ప్రారంభించాల్సి వచ్చింది. అమెరికాతో పాటు కొన్ని దేశాల ప్రతినిధులు సభలో ఉండటంతో ఎక్కువగా ఖాళీ కుర్చీలు కనిపించాయి. ఆ ఖాళీ కుర్చీలకే నెతన్యాహు తన ప్రసంగం వినిపించాల్సి వచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
BREAKING:
— Megatron (@Megatron_ron) September 26, 2025
🇮🇱🇺🇳 Netanyahu visibly SHAKEN as majority of UN delegates storm out of General Assembly hall
He was also booed.
The UN speaker has to calm down the situation: "Please ORDER in the hall"
Netanyahu began to boast about the murders Israel carried out, such as the… pic.twitter.com/NciSsPqdHJ

ప్రతినిధులు వెళ్లిపోయాక మాట్లాడిన నెతన్యాహు.. హమాస్ విషయంలో ఇజ్రాయెల్ తన పని ముగించాల్సి ఉందన్నారు. ఇజ్రాయెల్ బందీలు వినగలిగేలా గాజాలోని లౌడ్‌స్పీకర్ల ద్వారా తన ప్రసంగాన్ని ప్రసారం చేస్తున్నామని ఆయన వివరించారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థలు పరికరాలను స్వాధీనం చేసుకున్న తర్వాత గాజాలోని ప్రజల సెల్ ఫోన్‌ల ద్వారా తన ప్రసంగాన్ని ప్రసారం చేస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. మేము మిమ్మల్ని ఒక్క క్షణం కూడా మరచిపోలేదని, ఇజ్రాయెల్ ప్రజలు మీతో ఉన్నారని బందీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. హమాస్‌కు పంపిన సందేశంలో మీ ఆయుధాలను వదలండి... నా ప్రజలను వెళ్లనివ్వండని కోరారు. మీరు అలా చేస్తే బతుకుతారు, అలా చేయకపోతే, ఇజ్రాయెల్ మిమ్మల్ని వేటాడుతుందన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications