Viral Video: విమానం కుదుపులకు ఎగిరి పైకప్పులో దూరిపోయిన ప్రయాణికుడు-సినీ ఫక్కీలో..!

విమాన ప్రయాణాల్లో కుదుపుల ఘటనలు వింటూనే, చూస్తూనే ఉంటాం. కానీ ఓ విమానం కుదుపులకు ప్రయాణికుడు ఏకంగా ఏగిరి పైకప్పులోకి దూరిపోయిన ఘటన ఎక్కడైనా విన్నారా ? సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళ్తున్న ఓ అంతర్జాతీయ విమానం గాల్లో ఉండగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పైలట్లు కూడా చేసేదేమీ లేకపోయింది. అదే సమయంలో కదుపుల తీవ్రతకు ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరాడు. సీన్ కట్ చేస్తే పైకప్పులో ఉన్న బిన్ లోకి దూరిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఎలాగోలా రక్షించారు.

స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ నుంచి ఉరుగ్వే రాజధాని మాంటెవీడియోకు వెళ్తున్న ఎయిర్ యూరోపా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం బ్రెజిల్ కు సమీపంలోకి వస్తుండగా గాల్లో తీవ్ర కుదుపులకు లోనైంది. పైలట్లు విమానాన్ని ఎంత అదుపు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఓ దశలో తీవ్ర కుదుపులకు సీట్లో ఉన్న ఓ ప్రయాణికుడు కాస్తా ఎగిరి పైకప్పులో ఉన్న ఓవర్ హెడ్ బిన్ లోకి దూసుకెళ్లిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతన్ని బయటికి తీసుకొచ్చారు.

Viral Video Spanish flight Turbulence throws passenger into overhead bin

ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 30 మంది ప్రయాణికులు ఈ కుదుపుల కారణంగా తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో బ్రెజిల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమానంలో ఉన్న ప్రయాణికులు పలు వీడియోలు నెట్లో షేర్ చేశారు. దీంతో ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఓ వీడియోలో విమానం ఓవర్ హెడ్ బిన్‌లో నుండి ఒక వ్యక్తి కాళ్లను బయటకు తీయడం కూడా కనిపించింది. అలాగే మరికొన్ని వీడియోల్లో 325 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో కుదుపుల వల్ల సీలింగ్ ప్యానెల్‌లు, సీట్లు విరిగిపోయి ఆక్సిజన్ మాస్క్ లు వేలాడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+