యుద్ధం తెంచిన తంటా.. చిన్న పిల్లాడి ఆక్రందన.. సరిహద్దు దాటుతూ ఏడుపు..వీడియో వైరల్

ఆధిపత్యం కోసం.. తాము ఎక్కడ బలహీనం అవుతామని అనుకున్న రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్దం జరుగుతుంది. గత 14 రోజులుగా బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో జనం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని మరీ గడుపుతున్నారు. ఉక్రెయిన్ నుంచి ఎలాగొల సరిహద్దు దేశాలకు వెళుతున్నారు. అలా ఓ చిన్నారి వెళుతూ కనిపించాడు. అయితే అతనితో తల్లి, తండ్రి లేరు. ఒక్కడే నడుస్తూ వీడియోలో కనిపించాడు. ఏడుస్తూ ఉండటంతో.. మనస్సున ప్రతీ ఒక్కరినీ ఆ వీడియో కదిలించింది.

పొలాండ్ వెళుతుండగా..

పొలాండ్ వెళుతుండగా..

ఉక్రెయిన్ నుంచి పొలాండ్ కొందరు వెళుతున్నారు. ఆ సమూహంలో చిన్నారి కూడా ఉన్నారు. అతని చేతిలో చిన్న బ్యాగు కూడా ఉంది. అయితే దానిని పట్టుకొని.. ఏడుస్తూ మెల్లిగా నడుస్తున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దు గల మెడిస్కాలో గల పొలిష్ గ్రామం వద్ద ఆ వీడియో తీశారు. దానిని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు అయ్యో పాపం అంటూ కామెంట్లు చేశారు.

పట్టించుకోని వైనం

చిన్నారి ఏడుస్తున్న పక్కన ఉన్నవారు పట్టించుకోలే. దీనిపై ఓ నెటిజన్ ఖండించారు. అతనిని తన ఇంటికి చేర్చాలని కోరారు. తాను ఆలనా పాలనా చూసుకుంటానని చెప్పారు. చాలా మంది స్పందించారు. తాము సాయం చేస్తామని ముందుకువచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడంతో 38 మంది చిన్నారులు చనిపోయారు. 71 మంది గాయపడ్డారు. కివ్, మరిపొల్, ఖార్కివ్, సుమీ మీదుగా వందలాది మంది ఉక్రెనీయులు దేశం దాటారు. ఇప్పటివరకు 20 లక్షల మంది శరణార్థులు ఉక్రెయిన్ దేశం దాటి వెళ్లారని తెలుస్తోంది.

బీభత్సం

బీభత్సం

ఉక్రెయిన్‌లో రష్యా సేనలు విరుచుకు పడుతున్నాయి. మొదటి రెండు మూడు రోజుల యుద్ధంలో కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేశాయి. ఇప్పుడు జనావాసాలపై కూడా దాడులు చేస్తూ ఉండడంతో ఉక్రెయిన్‌లో మారణ హోమం జరుగుతుంది. వందల మంది సాధారణ పౌరులు కూడా మరణించారు. రష్యా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలంటూ కఠిన ఆంక్షలు కూడా విధిస్తున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించిన తగ్గేదేలే అన్నట్లు పుతిన్ దూసుకు పోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+