269 స్టోర్ల మూసివేత: రోడ్డున పడనున్న 16వేల మంది
వాషింగ్టన్: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ స్టోర్స్ తాజా ప్రకటనతో ఆ కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 269 వాల్‌మార్ట్ స్టోర్స్‌ను మూసివేయాలని భావిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆ కంపెనీ పేర్కొంది. ఈ నిర్ణయంతో సుమారు 16,000 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.
ఇందులో 6,000 మంది ఉద్యోగులు విదేశీ సిబ్బంది కావడం విశేషం. అమెరికాలోని 154 స్టోర్స్, విదేశాల్లోని 115 స్టోర్లను మూసివేయాలని వాల్‌మార్ట్ సీఈఓ నిర్ణయం తీసుకున్నారు. బ్రెజిల్‌లో ఇప్పటికే 60 వాల్‌మార్ట్ స్టోర్స్‌ను మూసివేశారు. అంతేకాదా బ్రెజిల్‌లో దేశ వ్యాప్తంగా వాల్‌మార్ట్ స్టోర్ల ఆదాయం 5 శాతం పడిపోయిందని పేర్కొన్నారు.

సాధ్యమైనంత వరకు వాల్‌మార్ట్ ఉద్యోగులను తమ అనుబంధ సంస్థల్లోకి బదిలీ చేశారు. జనవరి చివరికల్లా ఈ తతంగం పూర్తవుతుందని వాల్ మార్ట్ సీఈఓ డౌగ్ మెక్ మిలన్ పేర్కొన్నారు. లాటిన్ అమెరికాలోని వాల్‌మార్ట్ స్టోర్స్ ప్రస్తుతం అంత లాభదాయకంగా పని చేయడం లేదు.
దీంతో ఆయా స్టోర్లను మూసివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. పెద్ద గిడ్డంగి దుకాణాలు మరియు శివారు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా 405 స్టోర్స్ ప్రారంభించాలని వెల్లడించింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications