అమెరికా దాడికి ముందు ఇరాన్ అప్రమత్తమైందా? శాటిలైట్ చిత్రాల్లో కీలక ఆధారాలు!

Iran-America: ఆదివారం ఉదయం అమెరికా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా వైమానిక దళానికి చెందిన బీ2 బాంబర్లు ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు ఫోర్డో, నటాంజ్, ఇస్సహాన్‌లపై బాంబులు వేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను "పూర్తిగా విజయవంతమయ్యాయి" అని అభివర్ణించారు. ఇదిలా ఉండగా.. ఇరాన్ తన అణు కేంద్రాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం లేదని చెబుతోంది.

ఈ క్రమంలో అమెరికా దాడి చేసే సమయానికే అణు కేంద్రం నుంచి కీలక పరికరాలను యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. జూన్ 19-20 నాటి రాత్రి శాటిలైట్ చిత్రాల్లో భారీ సంఖ్యలో ట్రక్కులు, ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి. జూన్ 19న భూగర్భ సొరంగ ప్రవేశ మార్గం వద్ద 16 కార్గో ట్రక్కులు నిలిచి ఉండడం ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. జూన్ 20న అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రధాన అణుకేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఈ క్రమంలో కచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతోనే కీలకమైన సామాగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్ అక్కడి నుంచి తరలించినట్లు అనుమానిస్తున్నారు.

Was Iran Prepared Before the U S Airstrikes on Nuclear Sites

ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా దాడులను తీవ్రంగా ఖండించింది. శాంతియుత అణు ప్రదేశాలపై ఈ అమెరికా దాడి ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2, పేరా 4 ఉల్లంఘన అంటూ ఇరాన్ పేర్కొంది. ఇది బలప్రయోగాన్ని నిషేధిస్తుంది. సభ్య దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం గురించి మాట్లాడుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాలని.. అంతర్జాతీయ సూత్రాలు, ప్రమాణాలను ఉల్లంఘించినందుకు అమెరికా బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+