viral video:వామ్మో.. ఊచల్లో ఇరుక్కొని.. తీసేందుకు తండ్రి యత్నం, చివరికీ ఇలా బయటకు, వైరల్
ఇంటి వద్ద పిల్లలకు ఆట విడుపు కామనే.. అవును అంతా కలిసి ఆడుకుంటారు. అయితే కొన్నిసార్లు అనుకొని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఆ సమయంలో ఏం చేయాలో తోచదు. వెంటనే స్పందించి చర్యలు తీసుకంటే ఓకే.. లేదంటే ప్రాణం ఆడదు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవును.. ఓ పిల్లాడు గ్రిల్స్‌లో ఇరుక్కొన్నాడు. పక్కనే తండ్రి, ఓ శునకం కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు.

గ్రిల్స్ మధ్యలో పిల్లాడు
ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ వైరల్ అవుతుంది. ఇక్కడ ఓ పిల్లాడు గ్రిల్స్ మధ్యలో ఇరికాడు. తల పెట్టడంతో తప్పలేదు. పక్కనే ఉన్న తండ్రి వెంటనే మెల్లిగా తీసేందుకు ప్రయత్నించాడు. కానీ తల రాలేదు. గ్రిల్ పైన షూతో తన్నాడు. అయినా నో యూజ్.. పక్కనే శునకం కూడా అలానే ఉంది. వారంతా తెగ కష్టపడుతున్నారు. ఇంతలో ఆ పిల్లాడికే తెగ ఆలోచన రావడం లేదు.
ఇరుక్కున్న తల
తల తీయకుండా.. అతనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. మెల్లగా భుజంతో ముందుకు కదిలాడు. వంగి ముందటికి వచ్చాడు. ఇంకేముందు మరో చేయి గుండా రావడం చాలా ఈజీ అయిపోయింది. ఈ వీడియో 41 సెకన్ల నిడివి కాగా.. వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. వీడియోను ఇప్పటికే 17.9 మిలియన్ల మంది చూశారు. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. లైకులు కొడుతున్నారు.

గ్రేట్ థింగ్
ఆ చిన్నారి సమయానికి అనుకూలంగా స్పందించాడు. లేదంటే తండ్రి బయటకు వెళ్లి వచ్చేవరకు చూస్తే అలానే ఉండేవాడు. అతను చేసిన పనిని చాలా మంది అభినందిస్తున్నారు. వావ్ అని కొనియాడుతున్నారు. మంచి పని పొగుడుతున్నారు. అతని పెంపుడు కుక్క ఆనందానికి అవధి లేకుండా పోయింది. తండ్రి కూడా ఊపిరి పీల్చుకున్నాడు. వీడిని మరోసారి బయటకు పంపొద్దు అని ఫిక్స్ అయ్యారు.












Click it and Unblock the Notifications