Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముద్దు నచ్చని రాకుమారుడి ఇలా చేశాడు(వీడియో)

మొరాకో: రాజకుటుంబం తెచ్చిన ఆచారం ఆ రాకుమారుడికి ఇబ్బందిగా మారింది. రాజకుటుంబ ఆచారమైన రాకుమారుడి చేతిని ముద్దాడేందుకు ఇక్కడి సిబ్బంది, అధికారులు, సేవకులు వరుసగా నిలుచుకున్నారు.

అయితే ఆ రాకుమారుడికి మాత్రం ఆ పని ఇష్టం లేదు. దీంతో అతని చేసిన ప్రవర్తన అందరికీ విచిత్రంగా అనిపించింది. అది ఇప్పుడు సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకో రాకుమారుడు ప్రిన్స్‌ మౌలే హాసన్‌. ఈ రాకుమారుడి వయసు 12ఏళ్లు. సాధారణంగా రాజకుటుంబాలకు చెందిన వారిని ఎవరైనా అధికారులు, సిబ్బంది కలిసినప్పుడు.. వారికి నమస్కరించి, అనంతరం వారి చేతిని ముద్దాడడం ఆనవాయితీ.

ఇలా అందరూ తన చేతిమీద ముద్దుపెట్టడం ఈ యువ రాకుమారుడికి నచ్చడం లేదు. అందుకే ఎవరైనా ముద్దుపెట్టడానికి చేతిని దగ్గరకు తీసుకోగానే వెంటనే తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. దీంతో గమనించిన కొందరు అధికారులు ఆ రాకుమారుడికి షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చి నమస్కరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+