షాకింగ్ : సుడిగాలికి చిక్కాడు.. గిరగిరా తిరిగాడు (వీడియో)

కాలిఫోర్నియా : సుడిగాలి అంటే చాలామంది భయపడతారు. గాలి దుమారం లేచినప్పుడు సంభవించే సుడిగాలి బీభత్సం సృష్టిస్తుంది. సుడులు తిరుగుతూ భయం గొల్పుతుంది. అయితే కాలిఫోర్నియాలో జరిగిన సుడిగాలి ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుడిగాలిలో చిక్కుకున్న వ్యక్తి గిరగిరా తిరుగుతున్న సన్నివేశం ఓ వైపు షాకింగ్ గా అనిపించినా.. మరోవైపు నవ్వు తెప్పిస్తోంది.

కాలిఫోర్నియాలోని ఫెయిర్‌ఫీల్డ్ సిటీలో గాలిదుమారం లేవడంతో సుడిగాలులు వీచాయి. అయితే స్కేట్ పార్క్ లో జరిగిన ఘటన వైరలయింది. సుడిగాలి వీయడంతో చాలామంది తమను తాము రక్షించుకునేందుకు పార్క్ లోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో పార్క్ పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పు ఎగిరిపడింది.

Watch man get twirled in a wild dust devil at Fairfield skate park

అదలావుంటే సుడిగాలిలో ఓ వ్యక్తి చిక్కుకోవడం, గిరగిరా తిరగడం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. గాలిదుమారం కాస్తా నెమ్మదించాక సుడిగాలి నుంచి అతడు క్షేమంగా బయటపడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+