వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలిఫోర్నియాలో కరోనా కలవరం.. రికార్డుస్థాయిలో కేసులు.. మరణాలు కూడా.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు అమెరికాలో ఎక్కువగా వస్తోన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వారు ఆస్పత్రికి రావడంతో ఐసీయూలో బెడ్లు నిండిపోతున్నాయి. ఐసీయూ ఫుల్ అవడంతో ఆరోగ్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. ఆస్పత్రుల్లో రోగులు నిండటంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని లాస్ ఏంజెల్స్ కౌంటీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బర్బారా ఫెరార్ తెలిపారు.

వ్యాక్సిన్ వచ్చినా..

వ్యాక్సిన్ వచ్చినా..

ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. రాష్ట్ర, స్థానిక అధికారులు కాలిఫోర్నియాలో నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ప్రజలకు ప్రోటోకాల్స్/ ఆస్పత్రుల్లో విజిటర్స్‌కు కండీషన్స్ కఠినం చేస్తున్నారు. గత రెండువారాల నుంచి కాలిఫోర్నియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాలిఫోర్నియాలో కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. నవంబర్ 1వ తేదీన వారం రోజులకు గానూ 4,183 కేసులు రాగా.. అదీ గురువారం (వారం రోజులకు) 38,774కి చేరింది.

ఎందుకంటే..

ఎందుకంటే..

కాలిఫోర్నియాలోనే ఎందుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని అంటే.. రకరకాల కారణాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, పేద, తక్కువ ఇళ్లు ఉండటం కారణం అయి ఉంటుంది. అయితే కరోనా మరణాలు కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిిస్తోంది. గురువారం ప్రకటించిన కరోనా కేసులకు సంబంధించి.. వైరస్ సోకిన 379 మంది చనిపోయారని తెలిపారు. ఇదీ ఒకరోజు సింగిల్ హైయస్ట్ మరణాలు అని తెలిపింది.

పెరుగుతున్న మరణాలు..

పెరుగుతున్న మరణాలు..

బుధవారం 293 మంది చనిపోయారు. శుక్రవారం 300 మంది ఆసువులు బాసారు. కాలిఫోర్నియాకు చెందిన 22 వేల మంది వైరస్ సోకి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలో 1.7 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 52 వేల 281 మందికి కొత్తగా కరోనా వచ్చింది. 41 వేల మంది శుక్రవారం కరోనా వైరస్ వచ్చింది.

English summary
California has faced a surge of Covid-19 infections unparalleled across the United States, leading to continued daily record highs in hospitalizations and deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X