కాబూల్ ఎయిర్ పోర్టులో తాలిబన్లకు షాక్-అమెరికా వదిలేసిన విమానాలు, ఆయుధ వ్యవస్ధలు
ఆప్ఘనిస్తాన్ గడ్డపై రెండు దశాబ్దాల పాటు పాగా వేసిన అమెరికా బలగాలు సుదీర్గ విరామం తర్వాత నిన్న రాత్రి తిరిగి స్వదేశానికి వెళ్లాయి. అయితే ఆప్ఘనిస్తాన్ నుంచి వెనుదిరిగే సమయంలో అప్పటివరకూ తాము వాడిన కొన్నింటిని అక్కడే వదిలి వెళ్లిపోయాయి. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన తాలిబన్లకు అవి కంటపడ్డాయి. దీంతో వారు స్వాధీనం చేసుకున్నారు.
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లతో గతేడాది ట్రంప్ సర్కార్ శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అమెరికా బలగాలు క్రమంగా ఆ దేశాన్ని వీడటం మొదలుపెట్టాయి. అదే సమయంలో తాలిబన్లు కూడా ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో నిన్న చివరి అమెరికా సైనికుల బృందం కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్లింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన తాలిబన్ ఫైటర్లు షాకయ్యారు కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా బలగాలు అప్పటివరకూ వాడిన కొన్ని వస్తువుల్ని, వ్యవస్ధల్ని వదిలివెళ్లారు.
#Taliban fighters enter a hangar in #Kabul Airport and examine #chinook helicopters after #US leaves #Afghanistan. pic.twitter.com/flJx0cLf0p
— Nabih (@nabihbulos) August 30, 2021
కాబూల్ ఎయిుర్ పోర్టును వీడే ముందు అప్పటివరకూ తాము వాడిన 73 విమానాలు, ఆయుధ వ్యవస్ధలు, వాహనాలను మాత్రం అెమెరికా బలగాలు అక్కడే వదిలి వెళ్లాయి. రెండు దశాబ్దాలుగా తాలిబన్లపై పోరు కోసం అమెరికా బలగాలు వీటిని వాడాయి. కానీ ఇప్పుడు తిరిగి వాటిని అమెరికా తీసుకెళ్లేందుకు తగిన సమయం దొరకలేదు. తాలిబన్లు విధించిన డెడ్ లైన్ మేరకు కాబూల్ ఎయిర్ పోర్టును వీడాల్సి రావడంతో హడావిడిగా విమానాలు, ఆయుధ వ్యవస్ధలు, వాహనాలను అక్కడే వదిలి వెళ్లిపోయారు.
అమెరికా బలగాలు కాబూల్ ఎయిర్ పోర్టును వీడినట్లు నిర్దారించుకున్న తర్వాత తాలిబన్ ఫైటర్లు విమానాశ్రయ హ్యాంగర్ లోకి ప్రవేశించారు. అక్కడ కనిపించిన విమానాలు, ఇతర సామాగ్రిని చూసి ఆశ్చర్యపోయారు అదే సమయంలో తాము వాటిని పరిశీలిస్తున్న వీడియోను కూడా తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే అమెరికా అక్కడ వదిలివెళ్లిన విమానాలు కానీ, ఆయుధ వ్యవస్ధలు కానీ తిరిగి పనిచేసే పరిస్ధితుల్లో లేవని తెలుస్తోంది. మళ్లీ ఈ విమానాలు ఎగరలేవని అక్కడ వాటిని పరిశీలించిన తాలిబన్ ఫైటర్లు తమ వీడియోలో చెప్పడం కనిపించింది. అలాగే ఆయుధ వ్యవస్ధలను సైతం అమెరికా సైనికులు తాలిబన్లు వాడకుండా నిర్వీర్యం చేసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ ఆయుధ వ్యవస్ధలు తమకు ఉపయోగపడవని తాలిబన్లు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications