ప్లీజ్.. ప్లీజ్... మీ ప్రైవసీకి భంగం కలిగించం.. స్టేటస్ షేర్ చేసిన వాట్సాప్...
యూజర్లు ఎదురు తిరగడంతో వాళ్లను బతిమాలే పనిలో పడింది వాట్సాప్. మీ ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లబోదు అని యూజర్లను నమ్మించే ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీ అమలును మే వరకూ నిలిపేసిన వాట్సాప్.. తాజాగా తన స్టేటస్‌ను అప్‌డేట్ చేసింది. యూజర్లకు స్టేటస్‌లు చూసే అలవాటు ఉందని గ్రహించిన ఆ సంస్థ.. ఆ స్టేటస్ ద్వారానే తన గోడు వెల్లబోసుకుంది.
యూజర్ల ప్రైవసీకి కట్టుబడి ఉన్నామని.. మీ కాంటాక్ట్‌లను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోమని తేల్చిచెప్పింది. ప్రైవేట్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కాబట్టి వాటిని మేము చూసే, వినే అవకాశం లేదని చెప్పింది. షేర్ చేసిన లొకేషన్‌ను కూడా చూడమని స్పష్టం చేసింది. తమ డేటాకు భద్రత లేదని తెలిసిన చాలా మంది యూజర్లు ఇప్పటికే వాట్సాప్‌ను వీడి టెలిగ్రామ్, సిగ్నల్‌లాంటి ప్రత్యామ్నాయాల వైపు వెళ్తున్నారు. దీంతో వాట్సాప్ నష్ట నివారణ చర్యలకు దిగుతోంది.

ప్రైవసీ పాలసీ మారుతోందని అని వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల డేటా అంతా మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని తెలిపింది. దీనికి అంగీకరిస్తేనే వాట్సాప్ వాడండి.. లేదంటే లేదు అని యూజర్లకు నోటిఫికేషన్ కూడా పంపింది. అయితే వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. యూజర్లకు స్టేటస్ షేర్ చేసింది. అందులో వినమ్రంగా విన్నవించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications