జింబాబ్వే 'క్రొకడైల్', ఎవరీ ఎమర్సన్?: ముగిసిన ముగాబే శకం.. ఇదీ జరిగింది..
హరారే: గడిచిన పదిహేను రోజుల్లో జింబాబ్వేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం.. చివరకు ముగాబే(93) గద్దె దిగే పరిస్థితులకు అవి దారితీయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.
కేవలం ముగాబే చుట్టూ ఉన్న నేరస్తులను మట్టుబెట్టేందుకే ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేసినట్టు సైన్యం చెప్పినప్పటికీ.. అంతర్గత గుట్టు మాత్రం అందరికీ తెలిసిందే. ముగాబే గద్దె దిగడంపై అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ.. దీర్ఘ కాలంలో జింబాబ్వే ఎదుర్కోబోయే పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ముగిసిన ముగాబే శకం:
బ్రిటీష్ వలస పాలకులపై పోరాడి జింబాబ్వేకు స్వేచ్చా స్వాతంత్యాలు తీసుకురావడంలో ముగాబే పోషించిన పాత్ర అంత్యంత కీలకమైనది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా సహజంగానే ఆ తర్వాతి కాలంలో దేశ పగ్గాలు ముగాబే చేతికి వెళ్లాయి.
అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా జింబాబ్వేను ఆయన పాలిస్తున్నారు.
కానీ ఇటీవల సైన్యం ఆయనపై పరోక్షంగా తిరుగుబాటు చేయడంతో.. ఆయన రాజకీయ ప్రస్థానానికి ప్రమాదం ఏర్పడింది. శుక్రవారం దేశ కొత్త అధ్యక్షుడిగా ఎమర్సన్ నంగాగ్వా ప్రమాణ స్వీకారం చేయడంతో జింబాబ్వేలో ఇక ముగాబే శకం ముగిసిపోయింది.

ప్రజాభీష్టమే:
సైన్యం తిరుగుబాటు వెనుక ప్రజాభీష్టం కూడా కారణంగానే కనిపిస్తోంది. తన రెండో భార్య గ్రేస్ ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలనుకున్న ముగాబే ప్రయత్నాలు అక్కడి ప్రజలకు ఏమాత్రం రుచించలేదు. దానికి తోడు ఓవైపు జింబాబ్వే ప్రజలంతా దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంటే.. కేవలం షాపింగుల కోసమే గ్రేస్ కోట్లలో ఖర్చు చేయడం, పాలనలో ఆమె జోక్యం పెరిగిపోవడం ముగాబేపై ప్రజా వ్యతిరేకతను పెంచింది.

సంక్షోభం ఇలా:
జింబాబ్వే స్వాతంత్ర్య పోరాటంలో ముగాబేతో పాటు కీలక పాత్ర పోషించినవారిలో ఎమర్సన్ నంగాగ్వా ఒకరు. జాను-ఎఫ్ పార్టీలో ఉపాధ్యక్షుడి ఉన్న ఆయన్ను ముగాబే ఉన్నపలంగా తొలగించడం అసలు సంక్షోభానికి దారితీసింది. గ్రేస్ ను గద్దెనెక్కించాలన్న కుతూహలంతోనే ముగాబే ఆయనను అడ్డు తొలగించారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాలన్నింటిని నిశితంగా గమనించిన సైన్యం.. నిర్బంధంగా ముగాబేపై ఒత్తిడి తెచ్చి గద్దె తెచ్చింది.

ఎవరీ ఎమర్సన్:
ఎమర్సన్(75)ను అక్కడి ప్రజలు 'జింబాబ్వే క్రొకడైల్' అని అభివర్ణిస్తారు. 1960లో శ్వేత జాతి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన క్రొకడైల్ గ్యాంగ్ లో ఎమర్సన్ ఒకరు.
పార్టీ నుంచి తొలగించిన తర్వాత ఎమర్సన్ దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. ముగాబేను గద్దె దించిన నేపథ్యంలో బుధవారం మళ్లీ ఆయన జింబాబ్వేలో అడుగుపెట్టారు.
హరారేలో ఆయన కారు దిగిన వెంటనే అక్కడి ప్రజలంతా ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'ఇకనుంచి అణచివేతలేని ప్రజాస్వామ్యానికి మనమంతా ప్రత్యక్ష సాక్షులుగా ఉండబోతున్నాం' అంటూ వ్యాఖ్యానించారు.

జింబాబ్వేకు మూడో అధ్యక్షుడు:
శుక్రవారం నాడు ఆయన జింబాబ్వే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని హరారే శివారులోని నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో వేలమంది మద్దతుదారులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, విదేశీ దౌత్యవేత్తల హర్షాతిరేకాల మధ్య ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
కాగా, 1980లో కానాన్ బనానా జింబాబ్వేకు తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1987 నుంచి 2017, నవంబర్ వరకు ముగాబే ఆ బాధ్యతల్లో ఉన్నారు. తాజాగా జింబాబ్వే మూడో అధ్యక్షుడిగా ఎమర్సన్ బాధ్యతలు చేపట్టారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications