వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్ కాయిన్ ధర ఆరు నెలల్లో ఎందుకు సగానికి పడిపోయింది... క్రిప్టోవింటర్ అంటే ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇటీవల మార్కెట్ లో క్రిప్టో కరెన్సీల పతనం కనిపిస్తోంది

మార్కెట్‌లో అంతా బాగున్నప్పటి పరిస్థితులను పెట్టుబడిదారులు ఆర్ధిక పరిభాషలో 'రిస్క్ ఎపిటైజింగ్' అని అంటారు. చెప్పుకుంటారు. కానీ, ఇప్పుడున్నట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కష్టకాలంలో ఉన్నప్పుడు, వారు తమ పెట్టుబడులను సురక్షితమైన మార్గాలలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఈ రోజుల్లో ట్రేడర్లు ఫారిన్ ఫుడ్ కావాలని అడగడం లేదు. సంప్రదాయ మెనూను తమ టేబుల్ మీదకు తీసుకొస్తే చాలంటున్నారు.

మార్కెట్‌లో రిస్క్ ఎపిటైట్ పరిస్థితులు లేనందున, విలువను కోల్పోయే వాటిలో క్రిప్టో కరెన్సీలు ముందున్నాయి. ఎందుకంటే ఇవి స్థిరంగా ఉండవు.

డిజిటల్ కరెన్సీల ధరలో స్థిరమైన తగ్గుదలని సూచించడానికి పెట్టుబడిదారులు "క్రిప్టో వింటర్" అనే మాటను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ 'క్రిప్టో వింటర్' వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రారంభం నుంచే, మార్కెట్ ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకోవడం మొదలైందని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అలా హెచ్చరించిన వారిలో డేవిడ్ మార్కస్ ఒకరు. ఆయన అమెరికన్ వ్యాపారవేత్త. ఫేస్‌బుక్‌లో క్రిప్టోకరెన్సీ సెక్టార్ మాజీ హెడ్, అలాగే పేపాల్ మాజీ ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు.

https://twitter.com/CamyCrypto10/status/1523658836309004288

ఈ జనవరి లోనే క్రిప్టో వింటర్ మొదలైనట్లు ఆయన సంకేతాలిచ్చారు.

"క్రిప్టో వింటర్‌ లోనే అత్యుత్తమ వ్యాపారవేత్తలు అత్యుత్తమ కంపెనీలను నిర్మిస్తారు" అని మార్కస్ చెప్పారు.

మార్కెట్ విలువ ప్రకారం క్రిప్టో కరెన్సీలలో అతిపెద్దదైన బిట్‌కాయిన్ ఈ సోమవారం గత ఆరు నెలల్లో దాని విలువలో సగం నష్టాన్ని చవి చూడటం ద్వారా భవిష్యత్ పై హెచ్చరికలను పంపడం ప్రారంభించింది.

నవంబర్‌లో బిట్‌కాయిన్‌ 68,000 డాలర్ల దగ్గర ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని అందుకోగా, అక్కడి నుంచి 33,000 డాలర్లకు పడిపోయింది.

ప్రధాన ఎలక్ట్రానిక్ కరెన్సీ పతనం మిగిలిన క్రిప్టో కరెన్సీల మార్కెట్‌లను కూడా దెబ్బ తీసింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ మొత్తం వంద కోట్ల అమెరికన్ డాలర్లను నష్టపోయింది.

బిట్ కాయిన్ ధర గత ఆర్నెల్లలో సగానికి పడిపోయింది

బిట్‌కాయిన్ ఎందుకు క్రాష్ అయింది?

"క్రిప్టో కరెన్సీలు అధిక రిస్క్ ఉన్న అసెట్. కానీ, దీర్ఘకాలంలో వీటి ధర పెరుగుతుందని ఆశించే వ్యక్తులు ఉన్నారు'' అని ఎకనామీపీడియాలో కంటెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న జోస్ ఫ్రాన్సిస్కో లోపెజ్ చెప్పారు.

స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు పెట్టుబడిదారులు అత్యంత అస్థిర ఆస్తులను వదిలించుకోవడానికి ఇష్టపడతారని ఆయన బీబీసీతో అన్నారు.

వాల్‌స్ట్రీట్‌లో, నాస్‌డాక్ ఇండెక్స్‌లో ఉన్న టెక్నాలజీ కంపెనీల షేర్లు పడిపోయాయి. దీనికి, బిట్‌కాయిన్ పతనాననికి సంబంధం ఉందని ఎక్స్‌టీడీ కన్సల్టెన్సీ సీనియర్ విశ్లేషకుడు డియెగో మోరా అన్నారు.

డిజిటల్ కరెన్సీలు, టెక్నాలజీ కంపెనీల షేర్లు రెండూ పెట్టుబడిదారులకు సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఉపయోగపడతాయి కాబట్టి, ఈ రెండింటి పతనానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కానీ,యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించినప్పటి నుండి, ట్రెజరీ బాండ్లు, డాలర్ వంటి సురక్షితమైన ఆస్తుల వైపు పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.

''ఈ పరిస్థితులలో, ప్రజలు ప్రమాదంలో ఉన్న తమ ఆస్తులను విక్రయిస్తారు'' మోరా వివరించారు.

వడ్డీరేట్ల పెరుగుదలతో పాటు (గత వారం యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, కెనడా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో జరిగింది) షాంఘై లాక్‌డౌన్, యుక్రెయిన్‌లో యుద్ధం వంటివి ఆర్థిక వ్యవస్థ దిశలో అనిశ్చితిని పెంచడంలో సహాయపడే ఇతర అంశాలు

క్రిప్టో కరెన్సీల ధరల క్రమంగా పడిపోవడాన్ని క్రిప్టో వింటర్ అంటున్నారు

'క్రిప్టో వింటర్' భావన ఎక్కడి నుంచి వచ్చింది?

క్రిప్టో కరెన్సీల ధర స్తబ్ధుగా ఉండి, చాలా నెలలపాటు స్థిరంగా పడిపోతూ వస్తున్నప్పుడు నిపుణులు ఆ దశను 'క్రిప్టో వింటర్' అంటుంటారు. 2018 లో బిట్‌కాయిన్ ఆల్-టైమ్ హై నుండి 80% పడిపోయినప్పుడు ఏం జరిగిందో ఈ కాన్సెప్ట్ సూచిస్తుంది.

క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో క్రాష్ భయాందోళనలకు దారితీసింది. అత్యధిక సంఖ్యలో డిజిటల్ కరెన్సీలు క్షీణించాయి. 2019 మధ్యకాలం వరకు క్రిప్టో మార్కెట్‌లు రికవరీ సంకేతాలను చూపించాయి. బ్యాంకులు, పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్ వంటి సంప్రదాయిక సంస్థలు రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టడంతో ఇది జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why Bitcoin price has halved in six months What is CryptoWinter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X