Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తల్లితండ్రులను కాల్చేసి యువతి కిడ్నాప్.. కిడ్నాపర్ చెరలో 88 రోజుల నరకం.. సంచలనంగా రియల్ క్రైమ్ కహాని

అతనొక సైకోపాత్.. ఓ రోజు రాత్రి ఒక ఇంట్లోకి దూరి.. భార్యభర్తల్ని చంపేసి, వాళ్ల 13 ఏండ్ల కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. మారుమూల ప్రాంతంలో.. 88 రోజులపాటు అతనితో నరకం అనుభవించిన ఆమె.. చాకచక్యంగా తప్పించుకోగలిగింది.. చివరికి అతనికి శిక్షపడటం ఒకఎత్తైతే.. తన డేరింగ్ ఎస్కేప్ కథతో ఎంతోమందిని ఇన్ స్పైర్ చేస్తున్న జేమీ అనే అమ్మాయి గురించే ఈ కథనం..

ఆమె పారిపోతుందనుకోలేదు..

ఆమె పారిపోతుందనుకోలేదు..

అమెరికాలోని విస్కాన్సిన్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఇటీవల విడుదల చేసిన జేమీ క్లాజ్ కిడ్నాప్ కేసు తాలూకూ డాక్యూమెంట్లు సంచలనం రేపుతున్నాయి. కేసును ఇన్వెస్టిగేట్ చేసిన తీరు కంటే.. బాధితురాలు చూపించిన ధైర్యసాహసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హత్య, కిడ్నాప్ నేరాలు రుజువు కావడంతో జేక్ పాటెర్సన్(22)కు జీవితఖైదు పడింది. ‘‘నా నుంచి ఆమె తప్పించుకుంటుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఆమె నేను చెప్పినట్టు వినేది.. నాకు కోపం వచ్చే పనులు చేసేదికాదు.. ఒకరకంగా చెప్పాలంటే.. నేనంటే ఇష్టం ఉన్నట్లే ప్రవర్తించేది..''అని ఇన్వెస్టిగేష్ టైమ్ లో పాటెర్సన్ పోలీసులకు చెప్పాడు.

అతణ్ని నమ్మించాను..

అతణ్ని నమ్మించాను..

2018, అక్టోబర్ 15న పాటెర్సన్.. జేమీ ఇంట్లోకి దూరి.. వాళ్ల అమ్మానాన్నల్ని గన్ తో కాల్చి చంపాడు. కిడ్నాప్ తర్వాత జేమీని ఊరికి దూరంగా తీసుకెళ్లి.. ఓ క్యాబిన్ వ్యాన్ లో ఉంచాడు. ‘‘కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఫస్ట్ రోజే అతను నా దుస్తులు విప్పేసి, వాటిని కాల్చేశాడు. వేసుకోడానికి తన డ్రెస్ లు ఇచ్చాడు. తినడం, పడుకోవడం అన్నీ తనతోనే. మా అమ్మానాన్నని చంపినందుకు గిల్టీగా ఉందని అతను చాలాసార్లు ఏడ్చేవాడు. నన్ను కిడ్నాప్ చేసినందుకు కూడా కొన్ని సార్లు బాధపడేవాడు. అతను మెంటల్ ఇంబాలెన్స్ అని నాకు అనిపించింది. నేను మాత్రం ఏరోజూ ధైర్యం కోల్పోలేదు.. నా వల్ల అతనికి ప్రమాదం ఉండదని, ఎక్కడికీ తప్పించుకోనని అతణ్ని నమ్మించాను''అని చెప్పింది జేమీ.

కిడ్నాప్ కు ముందు.. కిడ్నాప్ తర్వాత..

కిడ్నాప్ కు ముందు.. కిడ్నాప్ తర్వాత..

88 రోజుల పాటు పాటెర్సన్ చెరలో ఉన్న జేమీ.. 2019 జనవరిలో చాక చక్యంగా తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించింది. కిడ్నాప్ జరిగే నాటికంటే ఇప్పుడు తనలో కాన్ఫిడెన్స్ పెరిగిందని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఇంతకముందు కంటే ఎక్కువ హ్యాపీగా గడుపుతున్నానని జేమీ చెబుతోంది. విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించిన జేమీ తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+