ఇక్కడ భార్యలు అద్దెకు దొరుకుతారు!

సహజంగా తాళి కట్టి పెళ్లి చేసుకున్న వారే భార్య అవుతారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండు ఒకటి తయారయింది. భార్యలు అద్దెకు కూడా దొరుకుతున్నారు. మీరు విన్నది నిజంగానే నిజం.. ఇంతకీ భార్యలు ఎక్కడ అద్దెకు దొరుకుతారు అని ఆలోచిస్తున్నారా? ఈ కథ కమామీషు మీకు తెలియాలంటే థాయిలాండ్ కు వెళ్లాల్సిందే.

థాయిలాండ్ లో ఈ ప్రాంతాలలో కొత్త ట్రెండ్
ఆగ్నేయ ఆసియాలో ఉన్న అందమైన దేశం థాయిలాండ్. ముఖ్యంగా టూరిజం మీదనే ఆధారపడే థాయిలాండ్ ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో ఒకటి. థాయిలాండ్లో థాయ్ మసాజ్ కు చాలా క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి ఇక్కడకు థాయ్ మసాజ్ కోసం వస్తారు. ఇక థాయిలాండ్ లో శారీరక సుఖం కోసం కూడా పట్టాయా వంటి ప్రాంతాలు చాలా ఫేమస్ అయ్యాయి.

wives for rent in thailand new trend in pattaya

Take a Poll

థాయిలాండ్ లో కొన్ని ప్రాంతాల్లో అద్దెకు భార్యలు
ఇక తాజాగా థాయిలాండ్ లో సరికొత్త ట్రెండ్ ఒకటి ప్రారంభమైంది. థాయిలాండ్ లోని కొన్ని ప్రాంతాలలో భార్యలు అద్దెకు దొరుకుతారు. కొంతమంది మహిళలు పర్యాటకులతో కలిసి భార్యలలానే సహజీవనం సాగిస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలిక వివాహం. ఇక ఇలా భార్యలుగా అద్దెకు వచ్చేవారిని థాయిలాండ్లో సరోగసి భార్యలు అంటారు. దీనిలో పురుషులు సదరు మహిళలకు డబ్బిచ్చి కొంతకాలానికి భార్యగా చేసుకుంటాడు.

భార్యలానే అన్ని పనులు చేస్తూ సహజీవనం
భార్యగా చేసుకున్న తర్వాత ఆమె ఆ పురుషుడితో అగ్రిమెంటు ఉన్నంతకాలం జీవిస్తుంది. అతనికి వంటచేసి పెట్టడం, అన్ని పనులు చేయడం, అతనితో కలిసి బయటకు వెళ్లడం, నిజంగా భార్య ఎటువంటి పనులు చేస్తుందో ఆ పనులన్నీ సరోగసి భార్యలు కూడా చేస్తారు. ఇదంతా ఒప్పందం ప్రకారం జరుగుతుంది కానీ, చట్టబద్ధం మాత్రం కాదు.

ధాయిలాండ్ మహిళలు సరోగసి భార్యలు
థాయిలాండ్ లో పేదరికం కారణంగా అక్కడి మహిళలు డబ్బు సంపాదించడం కోసం తమ కుటుంబాలను పోషించడం కోసం ఇలా సరోగసి భార్యలుగా మారుతున్నారు. ఇక ఇక్కడ అద్దెకు దొరికే భార్యలు ఒక్కొక్కరి రేటు ఒక్కో విధంగా ఉంటుంది. వారి వయసు, అందం, చదువు, సదర్ వ్యక్తులతో ఉండాల్సిన కాలవ్యవధి వంటి అంశాల పైన ఆధారపడి ఉంటుంది.

అద్దెకు భార్యల ధర ఇలా
మన దేశ కరెన్సీ లో చెప్పాలంటే వీరి ధర సుమారు 1.4 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇలా భార్యలను అద్దెకిచ్చే పద్ధతి థాయిలాండ్ లో కొత్తగా కొనసాగుతున్నప్పటికీ, జపాన్, కొరియా వంటి దేశాలలో ఇప్పటికే ఈ ట్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఫర్ హయర్ వంటి సేవలు ఇప్పటికే జపాన్, కొరియా దేశాలలో కొనసాగుతున్నాయి.

అద్దెకు భార్యల కల్చర్ పై ఆందోళన
ప్రస్తుతం థాయిలాండ్ లో భార్యలను అద్దెకి ఇస్తున్న ఈ కల్చర్ పైన అక్కడ కూడా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, దీని ద్వారా థాయిలాండ్ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తూ ఉండడంతో ఈ విధానం కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+