Mpox: మంకీపాక్స్ వైరస్ పై ఊరటనిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..! ఏం చెప్పిందంటే ?
మంకీపాక్స్ వైరస్ భయాలు భారత్ సహా పలు ప్రపంచదేశాల్ని వెంటాడుతున్నాయి. గతంలో కోవిడ్ వైరస్ వ్యాప్తితో జనం లక్షలాదిగా ప్రాణాలు కోల్పోయిన పరిస్ధితుల్ని చూసిన అనుభవం ఉండటంతో ఇప్పుడు మంకీపాక్స్ కూడా అదే తరహాలో మారుతుందన్న భయాలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాళ మంకీపాక్స్ పై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా బారత్ లో మంకీపాక్స్ అలర్ట్ లు ప్రకటిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటన ఊరటనిచ్చేలా ఉంది.
మంకీపాక్స్ లేదా ఎంపాక్స్ అనేది కోవిడ్ లా ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది. గతంలో కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న తరహా అనుభవాలు ఎంపాక్స్ వైరస్ వ్యాప్తితో ఉండవని తెలిపింది. అలాగే ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని కూడా వెల్లడించింది. అయితే గతంలో కోవిడ్ సమయంలో వ్యవహరించిన తరహాలోనే అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని పేర్కొంది. అప్పటి తరహాలో అప్రమత్తంగా ఉంటే మంకీపాక్స్ ను కూడా తరిమేయొచ్చని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తి భయాలు నెలకొన్నాయి. 2022 నుంచి ఇప్పటివరకూ ఇది 116 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ద గుర్తించింది. అలాగే దాదాపు లక్ష కేసులు నమోదయ్యాయి. ఇందులో 537 మరణాలు సంభవించాయి. మన దేశంలో రెండేళ్లుగా 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో చూస్తే మార్చిలో చివరి కేసు నమోదైంది. దీంతో భారత్ లోనూ మంకీపాక్స్ వ్యాప్తి అంతగా లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications