ప్రపంచ కుబేరుడిగా మరోసారి ఎలాన్ మస్క్; బెర్నార్డ్ ఆర్నాల్డ్ ను వెనక్కు నెట్టిన టెస్లాఅధినేత!!
ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెంబర్ వన్ గా నిలిచారు టెస్లా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు మస్క్.

మళ్ళీ టాప్ వన్ లో ఎలాన్ మస్క్
గతేడాది డిసెంబర్లో ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అయిన లూయిస్ విట్టన్ యొక్క సీఈవో అయిన బెర్నార్డ్ అర్నాల్డ్, ఎలాన్ మస్క్ ను వెనక్కి నెట్టి టాప్ వన్ పొజిషన్లో నిలిచారు. రెండు నెలలకు పైగా రెండవ స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ తిరిగి తన టాప్ వన్ స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు. బ్లూమ్ బెర్గ్ ప్రకారం టెస్లా షేర్లు 100% పెరుగుదలను నమోదు చేయడంతో ఎలాన్ మస్క్ తిరిగి బిలియనీర్స్ ఇండెక్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నారు.

బెర్నార్డ్ అర్నాల్డ్ సంపదను అధిగమించిన ఎలాన్ మస్క్
బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం సోమవారం నాటికి మార్కెట్లు ముగిసే సమయానికి ఎలాన్ మస్క్ నికర ఆస్తుల విలువ సుమారు 187.1 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు. ఇది బెర్నార్డ్ అర్నాల్డ్ యొక్క సంపదను అధిగమించిందని దీంతో రియల్ టైంలో బ్లూమ్ బెర్గ్ ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో తిరిగి టాప్ వన్ పొజిషన్లో నిలిచారు ఎలాన్ మస్క్.

గతేడాది భారీ నష్టాలను చవిచూసిన టెస్లా
గత సంవత్సరం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ యొక్క నికర విలువ 200 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. అతిపెద్ద సంపద నష్టంతో ఎలాన్ మస్క్ తన మొదటి స్థానాన్ని కోల్పోయారు. టెస్లా షేర్ల విలువ దారుణంగా క్షీణించడంతో ఊహించని నష్టం జరిగింది. గత సంవత్సరం వాల్ స్ట్రీట్ లో టెస్లాకు చెత్త సంవత్సరంగా మారింది. మొత్తం 700 బిలియన్ల డాలర్లను టెస్లా కోల్పోయింది.

తాజాగా టెస్లా షేర్ల దూకుడు.. మళ్ళీ ప్రపంచ కుబేరుడిగా మస్క్
ఇక అనేక నష్టాల మధ్య ట్విట్టర్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన ఎలాన్ మస్క్ ట్విట్టర్లో ఖర్చులను తగ్గించే పనిలో పడ్డారు. ఉద్యోగులను తొలగిస్తూ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ నష్ట నివారణ చర్యలను చేపట్టారు. ఇప్పటివరకు ట్విట్టర్లో 3700 కంటే ఎక్కువ ఉద్యోగాలను ఎలాంటి మస్క్ తొలగించారు. తాజాగా టెస్లా షేర్లలో దూకుడు కొనసాగుతున్న వేళ మళ్లీ మస్క్ ప్రపంచ కుబేరుడు గా నెంబర్ వన్ పొజిషన్లో నిలిచారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications