ప్రపంచ కుబేరుల జాబితా: ఎలాన్ మస్క్ కు షాక్, టాప్ లో అమెజాన్ అధినేత!!

టెస్లా దిగ్గజం , సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్ కు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ప్రపంచ సంపన్నుడిగా అగ్రస్థానంలో ఉన్న ఆయన తన హోదాను కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్ల విలువ సోమవారం ఏకంగా 7.2 శాతం క్షీణించడంతో ఆయన సంపద విలువ 197.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

దీంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ రియల్ టైం సూచీలో 200.3 బిలియన్ డాలర్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ నంబర్ 1 కుబేరుడిగా ఎలాన్ మస్క్ స్థానాన్ని ఆక్రమించారు. సోమవారం టెస్లా ఇంక్ షేర్లు 7.2 శాతం పడిపోయాయి. దీంతో బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో టెస్లా షేర్లు తగ్గడంతో, అమెజాన్ కి చెందిన జెఫ్ బెజోస్‌ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.

World s richest List Shock to Elon Musk Amazon jef bezos in the top bloomberg index

ప్రస్తుతం మస్క్ నికర విలువ 1977 బిలియన్లు కాగా, జెఫ్ బెజోస్‌ నికర విలువ 200.3 బిలియన్ డాలర్లు. గత తొమ్మిది నెలలుగా మొదటి స్థానంలోనే ఉన్న ఎలాన్ మస్క్ రెండవ స్థానానికి పడిపోయారు. ఎలాన్ మస్క్ కు, జెఫ్ బెజోస్‌ ఇద్దరి మధ్య 2021లో సంపద వ్యత్యాసం చాలా భారీగా ఉంది. అప్పుడు వీరిద్దరి మధ్య ఏకంగా 142 బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది.

అయితే గత కొంతకాలంగా టెస్లా షేర్లు భారీగా పడిపోవడంతో ఎలాన్ మస్క్ సంపద కరిగిపోతుంది. 2021లో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్న టెస్లా షేర్లు, ప్రస్తుతం ఏకంగా 50 శాతం మేర పతనమైన పరిస్థితి కనిపిస్తుంది. చైనాలో ఉన్న టెస్లా కంపెనీ ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గిందన్న రిపోర్టుల నేపథ్యంలో టెస్లా షేర్లు మళ్ళీ ఇప్పుడు భారీగా క్షీణించాయి.

అయితే గతంలో 2017లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఆయన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ని అధిగమించి నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డారు. మళ్లీ ఇంత కాలం తర్వాత ఇప్పుడు జెఫ్ బెజోస్‌ ప్రపంచ సంపన్నుడిగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇక రెండవ స్థానంలో ఎలాన్ మస్క్ నిలువగా, మూడవ స్థానంలో ఎల్వి హెచ్ఎం అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ 197. 5 బిలియన్ డాలర్లను నికర సంపదతో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+